పూజాహెగ్డే: ఐరెన్‌ లెగ్‌ కాదు.. గోల్డెనూ కాదు!

ABN , First Publish Date - 2022-04-16T01:02:09+05:30 IST

‘పూజా మన కాజా’ ఆమె అడుగుపెట్టిన సినిమా సూపర్‌హిట్టే... పూజా హెగ్డే గురించి ఇటీవల ఓ వేదికపై దిల్‌రాజు అన్న మాటలివి. తాజాగా ఆమె నటించిన చిత్రాల ఫలితం చూస్తే అలా లేదు.

పూజాహెగ్డే: ఐరెన్‌ లెగ్‌ కాదు.. గోల్డెనూ కాదు!

‘పూజా మన కాజా’

ఆమె అడుగుపెట్టిన సినిమా సూపర్‌హిట్టే... 

పూజా హెగ్డే గురించి ఇటీవల ఓ వేదికపై దిల్‌రాజు అన్న మాటలివి. 

తాజాగా ఆమె నటించిన చిత్రాల ఫలితం చూస్తే అలా లేదు



2012లో తమిళ చిత్రం ‘ముగమూడి’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది పూజాహెగ్డే. ఆ చిత్రం పరాజయం పాలైంది. దాంతో అక్కడ కథానాయికగా నిలదొక్కుకోవడం కుదరలేదు. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం’, ‘ముకుందా’ చిత్రాలతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాపడడంతో  బాలీవుడ్‌ బాట పట్టింది. ‘మొహంజోదారో’ చిత్రంలో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. భారీ చిత్రం కావడంతో ఆ సినిమాతో బాలీవుడ్‌లో సెటిల్‌ అయిపోవచ్చు అనుకుంది. అక్కడ కూడా పరాజయం ఎదురవ్వడంతో తన ఆశలు అడియాశలు అయ్యాయి. 




తెలుగులో మూడో చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’తో కథానాయికగా పూజా దశ తిరిగింది. ఆ సినిమా సూపర్‌హిట్‌ కావడం, గ్లామర్‌ డాల్‌ అని ముద్ర పడడంతో అవకాశాలు వరుస కట్టాయి. ఆ తర్వాత వచ్చిన ‘సాక్ష్యం’ లాంటి చిత్రాలు యావరేజ్‌గా ఆడినా.. తదుపరి ‘అరవింద సమేత వీరరాఘవ’ ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేశ్‌’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు సూపర్‌హిట్‌ కావడంతో పూజా సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా పేరొందింది. తర్వాత ప్రభాస్‌ సరసన ‘రాధేశ్యామ్‌’లో నటించింది. పూజా హెగ్డే నటించిన తొలి ప్యాన్‌ ఇండియా చిత్రమిది. ఈ సినిమాతో ప్యాన్‌ ఇండియాకు పరిచయం అవ్వబోతున్నందుకు తెగా సంబరపడిపోయిది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం అంతంత మాత్రంగా ఆడింది. తను నటించిన తొలి ప్యాన్‌ ఇండియా చిత్రం సరిగ్గా ఆడలేదనే ముద్ర పడింది. కానీ తెలుగు తిరుగులేని కథానాయికగా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్‌లోనూ మంచి ఆఫర్లు రాబట్టుకుంటోంది. 


ఇదే సమయంలో కోలీవుడ్‌లోనూ పాగా వేయాలని భావించినట్లుంది. వరుస చిత్రాల బిజీలోనూ విజయ్‌ సినిమా బీస్ట్‌’కు డేట్లు ఇచ్చింది. కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రమోషన్స్‌లోనూ పూజా చాలా యాక్టివ్‌గా పాల్గొంది. అయితే సినిమా మాత్రం బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడింది. దీనితో కోలీవుడ్‌లో పాగా వేయాలనే పూజా ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. కోలీవుడ్‌ సెంటిమెంట్స్‌ ప్రకారం ఇక పూజాకు తమిళనాట ఆఫర్లు కష్టమనే చెప్పాలి. బిగినింగ్‌ నుంచి పూజా కెరీర్‌ చూస్తే ఒక సినిమా హిట్‌ అయితే రెండు చిత్రాలు ఫెయిల్‌ అవ్వడం, మరో చిత్రం యావరేజ్‌గా ఆడడం జరిగింది. సో... పూజాది పూర్తిగా గోల్డెన్‌ లెగ్‌ అని అనలేము.. అలాగని ఐరెన్‌ లెగ్‌ అని చెప్పలేము. 


Updated Date - 2022-04-16T01:02:09+05:30 IST