ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌... మాటల్లో చెప్పలేకపోతున్నా: పూజాహెగ్డే

ABN , First Publish Date - 2021-12-09T23:36:15+05:30 IST

ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ చూశాక మాటలు రావడం లేదంటున్నారు హీరోయిన్‌ పూజాహెగ్డే. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ గురువారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌ వీక్షించిన అనంతరం కథానాయిక పూజా హెగ్డే తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌... మాటల్లో చెప్పలేకపోతున్నా: పూజాహెగ్డే

ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ చూశాక మాటలు రావడం లేదంటున్నారు హీరోయిన్‌ పూజాహెగ్డే. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ గురువారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌ వీక్షించిన అనంతరం కథానాయిక పూజా హెగ్డే తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ అద్భుతం. మాటలు రావడం లేదు. చూసిన వెంటనే లేని నిలబడి టీమ్‌ అందరికీ చప్పట్లతో అభినందనలు తెలపాలనిపించింది. ట్రైలర్‌ చూశాక నా ఫీలింగ్స్‌ ఎలా షేర్‌ చేసుకోవాలో తెలియడం లేదు’’ అని పూజా హెగ్డే ట్వీట్‌ చేశారు. 


Updated Date - 2021-12-09T23:36:15+05:30 IST