Ponniyin Selvan: నటులకు అంతంత రెమ్యూనరేషన్ ఇచ్చారా?

ABN , First Publish Date - 2022-09-26T20:48:11+05:30 IST

మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan). జయర రవి, ఐశ్వర్య రాయ్, చియాన్ విక్రమ్, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక

Ponniyin Selvan: నటులకు అంతంత రెమ్యూనరేషన్ ఇచ్చారా?

మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan). జయర రవి,  ఐశ్వర్య రాయ్, చియాన్ విక్రమ్, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల పొన్నియిన్ సెల్వన్‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కింది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో భారీ తారగణమంతా కనిపించనున్నారు. ఫేమ్, స్టార్‌డమ్ ఉన్న నటులు ఒకే సినిమాలో నటించడం అరుదు. అందువల్ల ఈ చిత్రంలోని నటులందరికి భారీ రెమ్యూనరేషన్‌ను చెల్లించాల్సి వచ్చిందని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. 


‘పొన్నియిన్ సెల్వన్’ లోని నటులల్లో అత్యధిక రెమ్యూనరేషన్‌ను అందుకున్నది విక్రమ్ (Vikram). ఈ సినిమాలో అతడు ఆదిత్య కరికాలన్‌ (Aditya Karikalan)గా నటించాడు. ఈ పాత్ర పోషిచినందుకు గాను రూ.15కోట్లను పారితోషికంగా తీసుకున్నాడట. నందిని పాత్ర పోషించిన ఐశ్వర్యా రాయ్ కూడా భారీగానే రెమ్యూనరేషన్‌ను తీసుకుందట. ఆమె రూ.10కోట్లను ఛార్జ్ చేసిందని సమాచారం. రాజరాజ చోళుని పాత్ర పోషించిన జయం రవి రూ.8కోట్లు, వంథియ దేవన్‌ (Vanthiyathevan) రోల్‌లో కనిపించిన కార్తి రూ.5కోట్లు, త్రిష రూ.2కోట్లు, ఐశ్వర్య లక్ష్మీ, ప్రకాష్ రాజ్ చెరో కోటిన్నర తీసుకున్నారని తెలుస్తోంది. చోళుల కాలం నాటి కథతో ‘పొన్నియిన్ సెల్వన్-1’ రూపొందింది. ఈ మూవీ బడ్జెట్ రూ.500కోట్లని తెలుస్తోంది. అప్పటి కాలం నాటి సెట్టింగ్స్‌ను వేయాల్సి రావడంతో భారీగా ఖర్చు అయిందని సమాచారం. గ్రాండియర్‌కు కూడా ప్రాధాన్యమివ్వాల్సి రావడంతో ఇంత బడ్జెట్ అయిందట. పోరాట సన్నివేశాలు కూడా ఉండటంతో విజువల్ ఎఫెక్ట్స్‌కు కూడా భారీగానే వెచ్చించాల్సి వచ్చిందట. ఈ చిత్రానికి ఏఆర్. రెహమాన్ సంగీతం అందించాడు. ఎడిటింగ్ బాధ్యతలను శ్రీకర్ ప్రసాద్ నిర్వహించాడు. ప్రొడక్షన్ డిజైనర్‌గా తోట తరణి వ్యవహరించాడు. ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం విడుదలయిన 6నెలల నుంచి 9నెలల తర్వాత రెండో భాగం విడుదల కానుందని మేకర్స్ తెలిపారు.

Updated Date - 2022-09-26T20:48:11+05:30 IST