పొన్నియిన్ వస్తున్నాడు
ABN , First Publish Date - 2022-07-03T09:29:20+05:30 IST
మణిరత్నం దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. చారిత్రక నేపథ్యంలో కాల్పనిక గాథతో రూపొందుతోంది.

మణిరత్నం దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. చారిత్రక నేపథ్యంలో కాల్పనిక గాథతో రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తొలిభాగాన్ని సెప్టెంబరు 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్యలక్షి ్మ ప్రధాన పాత్రలు పోషించారు. శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభితా ధూళిపాళ కీలక పాత్రల్లో నటించారు. చోళ సామ్రాజ్య విశేషాల ఆధారంగా తమిళ రచయిత్రి కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఈ చిత్రానికి ఆధారం. ఏ.ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ: రవివర్మన్