పోలీస్‌ పవర్‌.. లాఠీ

ABN , First Publish Date - 2022-07-25T06:07:32+05:30 IST

‘‘రేయ్‌... తప్పు చేసి తలదాచుకొనే పోకిరివి.. నీకే అంత పొగరున్నప్పుడు.. ఆ తప్పుని నిలదీసే పోలీసోడ్ని...నాకు ఎంత పొగరుంటుంది....

పోలీస్‌ పవర్‌.. లాఠీ

‘‘రేయ్‌... తప్పు చేసి తలదాచుకొనే పోకిరివి.. నీకే అంత పొగరున్నప్పుడు.. ఆ తప్పుని నిలదీసే పోలీసోడ్ని...నాకు ఎంత పొగరుంటుంది..’’ అంటూ తన పోలీస్‌ పవర్‌ చూపించబోతున్నారు విశాల్‌. ‘లాఠీ’ సినిమాలో. విశాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకుడు. సునైన కథానాయిక. రమణ, నంద నిర్మాతలు. ఆదివారం టీజర్‌ విడుదల చేశారు. ఇందులో విశాల్‌ చెప్పిన డైలాగులు ఆకట్టుకొంటున్నాయి. ‘‘విధి నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీస్‌ కానిస్టేబుల్‌గా విశాల్‌ నటించారు. పోలీస్‌ పవరు, పొగరు చూపించే చిత్రమిది. యాక్షన్‌ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. 


Updated Date - 2022-07-25T06:07:32+05:30 IST