పోలీస్ లుక్
ABN , First Publish Date - 2022-10-19T06:31:52+05:30 IST
బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘నేను స్టూడెంట్ సార్’. రాఖీ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు...

బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘నేను స్టూడెంట్ సార్’. రాఖీ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అవంతిక దస్సాని కథానాయిక. ‘నాంది’ సతీ్‌షవర్మ నిర్మిస్తున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు సముద్రఖని. ఆయన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆయన హీరోయిన్ తండ్రి పాత్రలో నటించారు. అర్జున్ వాసుదేవన్ అనే పోలీసాఫీసరుగా కనిపించనున్నారు. పోలీస్ యూనిఫాం ధరించి నడిచి వస్తున్న సముద్రఖని లుక్ గంభీరంగా ఉంది. సునీల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. మహతీ స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: అనితా మధాడి.