ప్రేమ పక్షులు Ranbir kapoor, Alia bhatt ఫొటోలపై నెటిజన్లు కామెంట్లు!
ABN , First Publish Date - 2021-09-29T21:29:43+05:30 IST
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తన 39వ జన్మదినోత్సవాన్ని ఇటీవల గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు.

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తన 39వ జన్మదినోత్సవాన్ని ఇటీవల గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. తన గాళ్‌ఫ్రెండ్ అలియా భట్‌తో కలిసి జోధ్‌పూర్ వెళ్లాడు. అక్కడ ఆ జంట తమకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేసింది. అక్కడ సూర్యాస్తమయం సమయంలో తీసుకున్న ఫొటోను ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. సూర్యాస్తమయ సమయంలో నది ఒడ్డున కూర్చుని రణ్‌బీర్ భుజంపై తల ఆన్చి తీసుకున్న ఫొటోను ఆలియా అభిమానులతో పంచుకుంది.
ఆ ఫొటోను షేర్ చేస్తూ ఆలియా.. `హ్యాపీ హ్యాపీ బర్త్ డే మై లైఫ్` అంటూ కామెంట్ చేసింది. అలాగే మరికొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ ఫొటోలను అటు రణ్‌బీర్ అభిమానులు, ఇటు ఆలియా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. `జంట అద్భుతంగా ఉంది`, `పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారు` అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే రణ్‌బీర్, ఆలియా పెళ్లి ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఆ వార్తలపై ఇద్దరూ స్పందించలేదు.