ఫోన్ నంబర్ కలిపింది ఇద్దరినీ!
ABN , First Publish Date - 2021-11-16T05:51:08+05:30 IST
‘పెళ్లి గోల’, ‘తరగతి గది దాటి’ వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న దర్శకుడు మల్లిక్‌రామ్. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అద్భుతం’. తేజా సజ్జా, శివానీ జంటగా నటించారు....

‘పెళ్లి గోల’, ‘తరగతి గది దాటి’ వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న దర్శకుడు మల్లిక్‌రామ్. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అద్భుతం’. తేజా సజ్జా, శివానీ జంటగా నటించారు. ఈనెల 19న డిస్నీ హాట్ స్టార్ ద్వారా నేరుగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో మల్లిక్ మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా ఇది నా రెండో చిత్రం. ఇది వరకు ‘నరుడా డోనరుడా’ చిత్రానికి దర్శకత్వం వహించా. ‘అద్భుతం’ ఓ విచిత్రమైన కథ. ఒకే ఫోన్ నంబర్ ఇద్దరికి కేటాయిస్తే.. ఏం జరుగుతుందన్న కాన్సెప్ట్‌తో తీశాం. ట్రైలర్ చూసినవాళ్లంతా ‘కొత్తగా ఉంద’ని అంటున్నారు. తేజ, శివానీ పాత్రలు కొత్తగా అనిపిస్తాయి. అంతులేని బాధని గుండెల్లో మోస్తూ పైకి నవ్వుతూ కనిపించే కుర్రాడిగా తేజ, చలాకీ అమ్మాయిగా శివానీ నటించారు. రొమాన్స్‌తో పాటు వినోదం కూడా ఉంటుంది. యువతరానికి నచ్చేలా తీర్చిదిద్దాం. ఇప్పటి వరకూ రీమేక్ కథలనే తెరకెక్కించా. ఇక మీదట సొంత కథలు చెప్పాలని ఉంద’’న్నారు.