మెగా హీరోతో 'పెళ్లి సందD' హీరోయిన్..?

ABN , First Publish Date - 2021-10-24T17:09:22+05:30 IST

మెగా హీరోతో 'పెళ్లి సందD' హీరోయిన్ నటించబోతోందా..అవుననే ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో ఇటీవల వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పెళ్లి సందD' సినిమాతో శ్రీలీల

మెగా హీరోతో 'పెళ్లి సందD' హీరోయిన్..?

మెగా హీరోతో 'పెళ్లి సందD' హీరోయిన్ నటించబోతోందా..అవుననే ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో ఇటీవల వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పెళ్లి సందD' సినిమాతో శ్రీలీల అనే అమ్మాయి హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాకి లేడీ డైరెక్టర్ గౌరీ రోనంకి దర్శకురాలు. అయితే, ఈ సినిమాతో హీరోయిన్ శ్రీలీల టాలీవుడ్ మేకర్స్‌ను బాగా ఆకట్టుకుంది. దాంతో ఈమెకు ఇప్పుడు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే మాస్ మహారాజ రవితేజ సరసన 'ధమాకా' అనే సినిమాలో నటిస్తోంది. త్రినాథ రావు నక్కిన దీనికి దర్శకుడు. కాగా మెగా హీరో నటించబోతున్న కొత్త ప్రాజెక్ట్‌కు హీరోయిన్‌గా మేకర్స్ శ్రీలీలను ఎంచుకున్నారట. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం తెలియడం లేదు. నిజంగా మెగా హీరో ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అయితే.. ఇక ఆమె స్టార్ తిరిగినట్టే. 

Updated Date - 2021-10-24T17:09:22+05:30 IST