పవన్ రీమేక్ ఆలస్యం
ABN , First Publish Date - 2022-07-17T07:35:37+05:30 IST
తమిళంలో విజయవంతమైన ‘వినోదయ సీతమ్’ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కథానాయకుడు.

తమిళంలో విజయవంతమైన ‘వినోదయ సీతమ్’ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కథానాయకుడు. సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారు. తన ‘హరి హర వీరమల్లు’ని కూడా తాత్కాలికంగా పక్కన పెట్టి ఈ రీమేక్‌ని త్వరితగతిన పూర్తి చేయాలని పవన్ భావించారు. ఈవారంలోనే షూటింగ్ కూడా మొదలవ్వాలి. అయితే... ఇప్పుడు ఈ రీమేక్‌ని కొన్ని రోజుల పాటు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. పవన్ ఇప్పుడు రాజకీయంగా బిజీగా ఉన్నారు. అందుకే.. సినిమా షూటింగ్‌కి సమయం కేటాయించలేకపోతున్నారని తెలుస్తోంది. పవన్ కాల్షీట్లు ఇవ్వగానే ఈ సినిమాని పట్టాలెక్కించాలని దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. త్రివిక్రమ్ మరోసారి.. ఈ సినిమా నిర్మాణ వ్యవహారాల్ని దగ్గరుండి చూసుకోబోతున్నారని తెలుస్తోంది.