వినోదాత్మకంగా కళాపురం

ABN , First Publish Date - 2022-08-13T06:24:35+05:30 IST

కుల వివక్ష, పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ‘పలాస 1978’, ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు కరుణకుమార్‌.

వినోదాత్మకంగా కళాపురం

కుల వివక్ష, పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ‘పలాస 1978’, ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ లాంటి  చిత్రాలతో  ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు కరుణకుమార్‌. ఈ సారి ఆయన పంథా మార్చి హాస్యరస ప్రధానంగా రూపొందిస్తున్న చిత్రం ‘కళాపురం’. ఈ ఊరిలో అందరూ కళాకారులే’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ నెల 26న విడుదలవుతోంది. జీ స్టూడియోస్‌ సమర్పణలో ఆర్‌ 4 ఎంటర్టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. సత్యం రాజేష్‌, చిత్రం శ్రీను, రక్షిత్‌ అట్లూరి ప్రధాన తారాగణం. పవన్‌ కల్యాణ్‌ ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సందర్భోచిత హాస్యంతో ‘కళాపురం’ ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పంచింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

Updated Date - 2022-08-13T06:24:35+05:30 IST