Pawan kalyan: మహేశ్‌కు మద్దతుగా నిలిచిన సందర్భం!
ABN , First Publish Date - 2022-08-09T20:18:10+05:30 IST
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సూపర్‌స్టార్ మహేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన చేపట్టే సేవా కార్యక్రమాలు, హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (Pawan kalyan) సూపర్‌స్టార్ మహేష్‌కు (Mahesh babu) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన చేపట్టే సేవా కార్యక్రమాలు, హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం. కృష్ణగారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. తండ్రి బాటలోనే దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు. (Pawan kalyan wishesh to mahesh)
‘అర్జున్’ సినిమా సందర్భంలో పైరసీపై పోరాటానికి మహేష్‌బాబు తన గళం వినిిపిస్తే ఆయనకు మద్దతుగా నిలిచాను. పరిశ్రమను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో అందరం వెన్నంటి నిలిచాం. ‘జల్సా’ సినిమాలో సంజయ్ సాహూ పాత్రను పరిచయం చేసేందుకు మహేష్ బాబు నేపథ్య గాత్రం అయితే బాగుంటుందని, దర్శకులు త్రివిక్రమ్ కోరగానే అంగీకరించిన సహృదయత మహేష్ బాబు గారిది. కథానాయకుడిగా తనదైన పంథాలో వెళ్తూ ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలు అందుకొంటున్న మహేష్ బాబు గారు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని పవన్ ప్రకటనలో పేర్కొన్నారు.