Hari Hara Veera Mallu: అద్భుతాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాం

Twitter IconWatsapp IconFacebook Icon
Hari Hara Veera Mallu: అద్భుతాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan), క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ (Krish) కాంబినేషన్‌లో.. మెగా సూర్య ప్రొడక్షన్ (Mega Surya Production) బ్యానర్‌పై ఏఎమ్ రత్నం (AM Rathnam) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఎమ్ఎమ్ కీరవాణి (MM Keeravani) సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఇటీవల వర్క్‌షాప్ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌‌డేట్‌ని తెలియజేస్తూ నిర్మాత ఏఎమ్ రత్నం ఓ ట్వీట్ చేశారు. అందులో..

Hari Hara Veera Mallu: అద్భుతాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాం

‘‘చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. సూక్ష్మమైన వివరాలు, పరిశోధన, వందలాది తారాగణం మరియు సిబ్బంది యొక్క అపారమైన కృషి అవసరమవుతుంది. అక్టోబర్ చివరి వారం నుండి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. పవన్ కల్యాణ్‌గారితో పాటు 900 మంది నటీనటులు మరియు సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘హరిహర వీరమల్లు’ ఒక మైలురాయి చిత్రం అవుతుందని మరియు ప్రపంచవ్యాప్తంగాప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం..’’ అని మెగా సూర్య ప్రొడక్షన్ సంస్థ  ట్విట్టర్ ద్వారా నిర్మాత ఏఎమ్ రత్నం తెలియజేశారు. (Hari Hara Veera Mallu Update)



AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.