స్టార్ డైరెక్టర్‌తో హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్న Pawan Kalyan..?

ABN , First Publish Date - 2022-06-21T22:48:10+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన చిత్రం బద్రి (Badri).

స్టార్ డైరెక్టర్‌తో హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్న Pawan Kalyan..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన చిత్రం బద్రి (Badri). ఈ సినిమా టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది. ఇప్పటికీ 'నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్'.. అని పవర్ స్టార్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఫ్యాన్స్ ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు. ఈ సినిమాతో పవన్ రేంజ్ మరింతగా పెరిగింది. ఇక ఇదే కాంబినేషన్‌లో వచ్చిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు'  వచ్చి మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది.


అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ - పూరి కాంబినేషన్‌పై అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోను హ్యాట్రిక్ సినిమా ఎప్పుడూ అనే ఆసక్తికరమైన చర్చలు సాగుతూనే ఉన్నాయి. అయితే, తాజా సమాచారం మేరకు పవన్ - పూరి కాబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే, క్రిష్ (Krish) దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్ (Bhavadeeyudu Bhagathsingh), బండ్ల గణేష్ (Bandla Ganesh) నిర్మాణంలో ఓ సినిమా, తమిళ సూపర్ హిట్ 'వినోదాయ సితం' తెలుగు రీమేక్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాల్సిన సినిమా ఉన్నాయి. 


ఈ క్రమంలోనే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, పవన్‌కు లైన్ చెప్పారట. అది బాగా నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ - పూరి కాంబోలో తెరకెక్కనున్న ఇందులో పవర్‌స్టార్‌ని ముఖ్యమంత్రి పాత్రలో చూపించబోతున్నారట పూరి. ఇక ఈ సినిమాని పూరి కేవలం మూడు నెలలో కంప్లీట్ చేస్తానని పవన్‌కు మాటిచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ ఉన్న పరిస్థితుల్లో ఇలా మూడు నాలుగు నెలల్లోపే సినిమా పూర్తి చేసే దర్శకుడు కావాలి. అది పూరి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. చూడాలి మరి ఈ కాంబోలో ప్రాజెక్ట్‌ను అధికారికంగా ఎప్పుడు ప్రకటించనున్నారో. 

Updated Date - 2022-06-21T22:48:10+05:30 IST