వ్యాధితో బాధపడటంతో.. అనేక ప్రశ్నలతో వేధించేవారంటున్న Parvathy Thiruvothu..

ABN , First Publish Date - 2021-10-10T00:45:55+05:30 IST

సినిమాల్లో నటించేవారు భోగ, భాగ్యాలను అనుభవిస్తుంటారని అందరూ అనుకంటారు. పైకి కనిపించేది వేరని అక్కడ పని చేసేవారికే తెలుస్తుంటుంది. నటీ, నటులకు కూడా బాధలు, ఇబ్బందులు ఉంటాయంటున్నారు.

వ్యాధితో బాధపడటంతో.. అనేక ప్రశ్నలతో వేధించేవారంటున్న Parvathy Thiruvothu..

సినిమాల్లో నటించేవారు భోగ, భాగ్యాలను అనుభవిస్తుంటారని అందరూ అనుకంటారు. పైకి కనిపించేది వేరని అక్కడ పని చేసేవారికే తెలుస్తుంటుంది. నటీ, నటులకు కూడా బాధలు, ఇబ్బందులు ఉంటాయంటున్నారు. తాము చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడ్డామని సమంత, యామీ గౌతమ్ తెలిపారు. సరైనోడు సినిమాలో తమిళ అమ్మాయి సెల్వీ పాత్రలో కనిపించిన విద్యుల్లేఖ రామన్ అధిక బరువుతో ఇబ్బంది పడ్డానని చెప్పింది. తాజాగా ఒక హీరోయిన్ మానసిక వ్యాధితో బాధపడ్డానని చెప్పింది.


బెంగళూరు డేస్, టేకాఫ్, చార్లీ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన మాలీవుడ్ నటి పార్వతి తిరువొత్తు. తను బులీమియా( శరీరంలోని అవయవాల్లో మార్పు రావడంతో మానసికంగా కుంగిపోవడం) అనే వ్యాధితో కొన్ని ఏళ్లు బాధపడ్డనని తెలిపింది. తను దాని నుంచి బయటపడ్డ విదానాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 


‘‘ నా బుగ్గలు లావుగా ఉన్నాయని నాతో పనిచేసిన వారు చెప్పేవారు. వారు అనుకున్న విధంగా నా దవడ ఉండేది కాదు. అందువల్ల వారు తరచుగా కామెంట్ చేసేవారు. ఫలితంగా నేను నవ్వడం మానేశాను. కొన్ని ఏళ్లు నా భావాలను అదుపులో ఉంచుకున్నాను. పని ప్రదేశాల్లో, ఇతర కార్యక్రమాలకు వెళ్లినప్పుడు నేను ఒంటరిగా తినేదాన్ని.  ప్లేట్లో ఎంత అన్నం వేసుకున్నానో అని కొంత మంది వెనుక నుంచి చూసేవారు. కొంచెం తక్కువ తినమని చెప్పడంతో ఇంకో ముద్ద దిగేది కాదు. నువ్వు డైటింగ్ మొదలుపెట్టావా, బరువును తగ్గావా అనే ప్రశ్నలతో వేధించేవారు. నేను వారి నుంచి తప్పించుకోవడానికి ఒక కవచాన్ని ఏర్పాటు చేసుకున్నాను. పూర్తిస్థాయిలో నవ్వడానికి కొన్ని ఏళ్లు పట్టింది. అనేక మంది మిత్రులు, ఫిట్‌నెస్ కోచ్, థెరపిస్ట్‌ల సహకారంతో పూర్తి స్థాయిలో నవ్వగలుగుతున్నాను ’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టు చేసింది. 


ఇతరుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండని వెల్లడించింది. మీరు ఎంత ఫిట్‌గా ఉన్నప్పటికీ ఇతరుల శరీరాల మీద జోక్స్, కామెంట్స్ చేయకండని వివరిచింది. 


Updated Date - 2021-10-10T00:45:55+05:30 IST