ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు వెబ్ సిరీస్

ABN , First Publish Date - 2021-12-26T19:28:25+05:30 IST

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లేటెస్ట్ గా విడుదలైన తెలుగు వెబ్ సిరీస్ ‘పరంపర’. అధికారం, పగ, ప్రతీకారం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. జగపతిబాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర, ఆకాంక్ష సింగ్, కీలక పాత్రల్లో నటించారు. ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ఆర్కా మీడియా ప్రొడక్షన్స్ అధినేత ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు వెబ్ సిరీస్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లేటెస్ట్ గా విడుదలైన తెలుగు వెబ్ సిరీస్ ‘పరంపర’. అధికారం, పగ, ప్రతీకారం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. జగపతిబాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర, ఆకాంక్ష సింగ్, కీలక పాత్రల్లో నటించారు. ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ఆర్కా మీడియా ప్రొడక్షన్స్ అధినేత ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో శరత్ కుమార్, జగపతి బాబుల నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసలొస్తున్నాయి.


వెబ్ సిరీసే అయినా.. యాక్షన్ మూవీ తరహా ట్రీట్ మెంట్ తో ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. మూడు జనరేషన్స్ కు సంబంధించిన ‘పరంపర’ కథ వారసత్వానికి, అర్హతకి మధ్య జరిగే ఘర్షణ. ఫ్యామిలీ, యాక్షన్, లవ్, ఎమోషన్స్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సిరీస్ లో ఉంటాయి. ఫస్ట్ సీజన్ లో మొత్తం 7 ఏపిసోడ్స్ ఉంటాయి. ‘ఫ్యామిలీ మేన్’ తరహాలో ఈ వెబ్ సిరీస్ కు కూడా రీచ్ ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు మేకర్స్. అంచనాలకు తగ్గట్టుగానే ‘పరంపర’ వెబ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ ను షేక్ చేస్తోంది.  

Updated Date - 2021-12-26T19:28:25+05:30 IST