'పరంపర' (parampara).. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సృష్టించిన సంచలనం. మొదటి సీజన్ సృష్టించిన ఆ సంచలనానికి కొనసాగింపుగా ఇప్పుడు రెండో సీజన్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. మొదటి సీజన్ కథని ముందుకు నడిపిస్తూ మరో సంచలనంగా హాట్ స్టార్ ప్రేక్షకులకు కొత్త తరహాలో కథా సంవిధానం అద్భుతం అనిపిస్తోంది. నాయుడు, గోపి మధ్య మొదలైన యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో ఊహించని మజిలీలతో ఆసక్తి రేపుతున్న "పరంపర సీజన్ 2" (parampara Season 2) ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్.
ఎవరికోసమో మొదలుపెట్టిన యుద్ధం.. దేనికోసం అనే ప్రశ్న దగ్గర ఆగితే.. దానికి అసలైన సమాధానమే "పరంపర" సీజన్ 2. పాయింట్ బ్లాంక్ కి భయపడకుండా, ఎదురువెళ్ళి తెగబడే ఓ యువకుడి ధైర్యం ప్రపంచానికి వినిపించిన ఒక కొత్త స్వరం "పరంపర" సీజన్ 2. ప్రేమ, ప్రతీకారాల మధ్య.. నమ్మిన సిద్ధాంతం ఎవరిని ఎటు నడిపించిందో.. ఏ బంధాన్ని ఏ తీరానికి చేర్చిందో తెలుసుకోవాలంటే సీజన్ 2 తప్పక చూడాల్సిందే. యంగ్ హీరో నవీన్ చంద్ర (Naveen Chandra) ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్‌సిరీస్‌లో జగపతి బాబు (Jagapathi Babu), శరత్‌కుమార్ (Sarath Kumar) ఇతర కీలక పాత్రల్లో నటించారు.