డీసెంట్‌ కామెడీ మూవీగా ‘పన్నికుట్టి’

ABN , First Publish Date - 2022-07-11T17:50:22+05:30 IST

గత శుక్రవారం కోలీవుడ్‌లో తెరపైకి వచ్చిన చిత్రాల్లో ‘పన్నికుట్టి’ ఒకటి. లైకా ప్రొడక్షన్‌, సూపర్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మించగా అనుచరణ్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ హాస్య నటులు యోగిబాబు, కరుణాకరన్‌ ప్రధాన పాత్రలను పోషించారు.

డీసెంట్‌ కామెడీ మూవీగా ‘పన్నికుట్టి’

గత శుక్రవారం కోలీవుడ్‌లో  తెరపైకి వచ్చిన చిత్రాల్లో ‘పన్నికుట్టి’ ఒకటి. లైకా ప్రొడక్షన్‌, సూపర్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మించగా అనుచరణ్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ హాస్య నటులు యోగిబాబు, కరుణాకరన్‌ ప్రధాన పాత్రలను పోషించారు. రవి మురుగయ్య స్టోరీ అందించగా, స్ర్కీన్‌ప్లే అనుచరణ్‌, రవి మురుగయ్య సమకూర్చారు. సతీష్‌ మురుగన్‌ ఛాయాగ్రహణం సమకూర్చిన ఈ చిత్రానికి సంగీతం కె. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. డీసెంట్‌ కామెడీ మూవీ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 


కథను పరిశీలిస్తే.. ‘ఉత్రాపతి(కరుణాకరన్‌) జీవితంలో అన్నీ కష్టాలే. ఈయన చెల్లి నీలావతి (షాదిక) భర్తతో గొడవపడి పుట్టింట్లోనే ఉంటుంది. ఉత్రాపతి తండ్రి కరుప్పు (టీపీ గజేంద్రన్‌) తాగుబోతు. ఇవికాకుండా, తనకు ఒక్క ప్రియురాలు కూడా దక్కలేదన్న బాధలో ఉత్రాపతి మనోవేదన చెందుతుంటాడు. ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టడంతో జీవితంపై నమ్మకం కోల్పోయి విరక్తి చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడతాడు. దాన్ని గమనించిన కొందరు అతన్ని రక్షిస్తారు. సమస్యలకు పరిష్కారం చూపించే ఓ స్వామీజీ వద్దకు ఉత్రాపతిని తీసుకెళతారు. ఆ స్వామీజీ ఎవరు? ఆయన ఏం చెప్పారు? ఉత్రాపతిని చుట్టిముట్టిన కష్టాలకు పరిష్కారమార్గం లభించిందా? అన్నదే ఈ చిత్ర కథ. ముఖ్యంగా ఒక పందిపిల్లను కేంద్రంగా చేసుకుని జాలీగా సాగిపోయేలా ఈ చిత్రాన్ని దర్శకుడు ఎంతో తెలివిగా, ఓర్పుతో చిత్రీకరించారు. ఈయన తొలి చిత్రం ‘కిరుమి’ (క్రిమి) ఒక ఆసక్తికరమైన థ్రిల్లర్‌ మూవీ. ఇప్పుడు డిసెంట్‌ కామెడీ చిత్రంగా పన్నికుట్టి ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. 

Updated Date - 2022-07-11T17:50:22+05:30 IST