పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ‘భీమ్లానాయక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కైవసం చేసుకున్నారు. తదుపరిగా క్రిష్ ‘హరిహర వీరమల్లు’ చిత్రం బ్యాలెన్స్ షూట్ ను కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీలో నటించాలి. మార్చ్ చివరి వారం నుంచి ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ పునః ప్రారంభం కానుంది. ఇది కంప్లీట్ కాగానే.. హరీశ్ శంకర్ చిత్రంలో పవన్ నటించబోతున్నారు. ఈ సినిమాకోసం హరీశ్ పవర్ ఫుల్ స్ర్కిప్ట్ లాక్ చేసుకొని ప్రస్తుతం కేస్టింగ్ సెట్ చేసే హడావిడిలో ఉన్నాడు.
తాజా సమాచారం ప్రకారం ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రను ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ ఫేమ్ పంకజ్ త్రిపాఠీ నటించబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ లోనూ స్ట్రీమ్ అయిన ఈ వెబ్ సిరీస్ తో పంకజ్ త్రిపాఠీ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ క్రేజ్ తోనే పలు సినిమాల్లో నటుడిగా బాగా బిజీ అయిపోయారు. నిజానికి మంచు విష్ణు నటించిన ‘దూసుకెళ్తా’ చిత్రంలో పంకజ్ త్రిపాఠీ విలన్ గా నటించారు. ఇప్పుడు మళ్ళీ పవర్ స్టార్ సినిమాతో టాలీవుడ్ లో నటించనుండడం విశేషంగా మారింది. జూలై మొదటి వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. పవర్ స్టార్ ప్రొఫెసర్ గా నటించబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.