Yash: ‘కెజియఫ్’ పూర్తయినా గన్ వదలని రాకీ భాయ్
ABN , First Publish Date - 2022-09-29T23:10:07+05:30 IST
రాకింగ్ స్టార్ యశ్ (Yash) హీరోగా నటించిన సినిమా ‘కెజియఫ్’ (KGF). రెండు భాగాలుగా రూపొందింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు
రాకింగ్ స్టార్ యశ్ (Yash) హీరోగా నటించిన సినిమా ‘కెజియఫ్’ (KGF). రెండు భాగాలుగా రూపొందింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. కాసుల వర్షాన్ని కురిపించాయి. ‘కెజియఫ్: చాప్టర్-2’ బాలీవుడ్‌లోనే ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా పూర్తి రన్‌లో రూ.1000కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. యశ్ ‘కెజియఫ్-2’ లో కలష్నీకోవ్ గన్‌లను చేత పట్టుకుని ప్రత్యర్థుల ఆటకట్టించిన తెలిసిందే. వారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. అయితే, రియల్ లైఫ్‌లో యశ్ గన్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాన్ ఇండియా స్టార్ యశ్ లాస్ ఏంజెలిస్‌లో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. స్టైల్‌గా ఫైరింగ్ రేంజ్‌లోని లక్ష్యాలను చేధిస్తున్నాడు. వీడియో కింద.. ‘‘లక్ష్యాలను చేరుకోవడానికి ఎల్లప్పుడు మార్గం ఉంటుంది. కానీ, ఆ లక్ష్యాన్ని కనిపెట్టడమే సవాల్. థాంక్ యూ మై మ్యాన్ పెర్రీ. వచ్చే సారి కలష్నీకోవ్‌తో ప్రాక్టీస్ చేద్దాం’’ అని యశ్ క్యాప్షన్ ఇచ్చాడు. కలష్నీకోవ్ రైఫిల్‌ని వాడుక భాషలో ‘ఏకే-47’ అని పిలుస్తుంటారు. ‘ఏకే’ అంటే అవ్టోమాట్ కలష్నీకోవ్. ఈ రైఫిల్ డిజైన్ 1947లో పూర్తవ్వడంతో ‘ఏకే-47’ అని పేరు పెట్టారు. ఇక యశ్ కెరీర్ విషయానికి వస్తే.. ‘కెజియఫ్ చాప్టర్-2’ అనంతరం అతడికి వరల్డ్ వైడ్‌గా క్రేజ్ పెరిగిపోయింది. ఆ స్థాయికి తగ్గ కథలు అతడి వద్దకు రావడం లేదు. ‘మఫ్తీ’ దర్శకుడు నర్తన్‌తో ఓ సినిమా చేస్తాడని గతంలో వార్తలొచ్చాయి. అయితే, నర్తన్ చెప్పిన కథకు యశ్ ఓకే చెప్పలేదని సమాచారం.