పాన్‌ ఇండియా ఫిల్మ్ ‘క్రిమినల్‌’ మోషన్‌ పోస్టర్‌ విడుదల

ప్రముఖ సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాష్‌ కుమార్‌ చేతుల మీదుగా ‘క్రిమినల్‌’ మోషన్‌ పోస్టర్ విడుదలైంది. కమలా ఆర్ట్స్‌ పతాకంపై పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్‌ సీపీ హీరోగా నటిస్తుండగా.. జాహ్నవి, ఫెస్సీ, అరవింద్‌ ఎంఎన్‌, విజయ్‌ పీటర్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఆపిల్‌ పైనాపిల్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని నిర్మాత శశిదురై నిర్మించారు. టైటిల్‌ పోస్టర్‌, మూవీ ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌.థాను, మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్‌ చేశారు. ఇపుడు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ నిర్మాణ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదలకానుంది.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.