గోపీచంద్‌ ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ తాజా అప్‌డేట్‌

మ్యాచో హీరో గోపీచంద్‌, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా విలక్షణ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా బ‌న్నీవాసు నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్నట్లుగా చిత్రయూనిట్‌ ప్రకటించింది. టైటిల్‌ ప్రకటన నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను దర్శకుడు మారుతి తెలియజేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే సింహ భాగం పూర్తయిందని, హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాలతో పాటు.. అల్లు స్టూడియోస్, అన్న‌పూర్ణ స్టూడియోస్‌లలో చిత్ర షూటింగ్‌ జ‌రుగుతున్నట్లుగా తెలిపారు. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తుండగా.. ఎస్‌.కె.ఎన్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు‌.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.