‘మోడ్రన రఫీ’ సోనూ నిగమ్‌‌కు ‘పద్మశ్రీ’

ABN , First Publish Date - 2022-01-26T04:25:15+05:30 IST

సంగీత ప్రపంచంలో సూపర్‌ హిట్‌ గీతాలకు చిరునామాగా మారిన సోనూ నిగమ్‌కు పద్మశ్రీ దక్కింది. 48 ఏళ్ల సోనూ నిగమ్‌ హిందీ, తెలుగు, తమిళ, బెంగాళీ, తుళు... ఇలా పలు భాషల్లో దాదాపు ఐదు వేలకు

‘మోడ్రన రఫీ’ సోనూ నిగమ్‌‌కు ‘పద్మశ్రీ’

సంగీత ప్రపంచంలో సూపర్‌ హిట్‌ గీతాలకు చిరునామాగా మారిన సోనూ నిగమ్‌కు పద్మశ్రీ దక్కింది. 48 ఏళ్ల సోనూ నిగమ్‌ హిందీ, తెలుగు, తమిళ, బెంగాళీ, తుళు... ఇలా పలు భాషల్లో దాదాపు ఐదు వేలకు పైగా పాటల్ని ఆలపించారు. సంగీత దర్శకుడిగా, రియాలిటీ షో న్యాయ నిర్ణేతగా బాలీవుడ్‌లో సోనూ విశేష ప్రాచుర్యం పొందారు. కొన్ని సినిమాల్లోనూ నటించారు. పలు ఆల్బమ్స్ రూపొందించి, సంగీత ప్రేమికుల్ని ఉర్రూతలూగించిన సోనూ.. 1973లో హర్యానాలోని ఫరిదాబాద్‌లో జన్మించారు. అలనాటి గాయకుడు మహ్మద్‌ రఫీని స్ఫూర్తిగా తీసుకొని పరిశ్రమలోకి అడుగు పెట్టిన సోనూ.. ‘మోడ్రన రఫీ’గా ఖ్యాతి గాంచారు. కళలకు సంబంధించిన రంగంలో మహారాష్ట్ర తరపున సోనూ నిగమ్‌ పద్మశ్రీకి ఎన్నికయ్యారు.

Updated Date - 2022-01-26T04:25:15+05:30 IST