వినాయక్‌ చేతుల మీదుగా

ABN , First Publish Date - 2022-01-21T10:00:07+05:30 IST

యండమూరి వీరేంద్రనాధ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. సునీల్‌, కౌశన్‌, బెనర్జీ ప్రధాన పాత్రలు పోషించారు...

వినాయక్‌ చేతుల మీదుగా

యండమూరి వీరేంద్రనాధ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. సునీల్‌, కౌశన్‌, బెనర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. రవి కనగాల, రామ్‌ తుమ్మలపల్లి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయ్యింది. గురువారం హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినాయక్‌ మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ చాలా బాగుంది. సాహితీ ప్రపంచంలో యండమూరి ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం ఉంద’’న్నారు. 

Updated Date - 2022-01-21T10:00:07+05:30 IST