వీరిద్దరి సినిమా ఓటీటీలోనే
ABN , First Publish Date - 2021-11-14T05:30:00+05:30 IST
చియాన్ విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ తొలిసారిగా కలసి నటిస్తున్న ‘మహాన్’ చిత్రం షూటింగ్ పూర్తయింది...

చియాన్ విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ తొలిసారిగా కలసి నటిస్తున్న ‘మహాన్’ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని లలిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేటర్‌లో కాకుండా ఓటీటీలో విడుదలవుతుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఓటీటీనా, థియేటర్‌లోనా అనే సందిగ్ధంలో ఉన్న చిత్ర నిర్మాత లలిత్‌కుమార్ చివరకు ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. భారీ మొత్తం చెల్లించి, అమెజాన్ సంస్థ హక్కులు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనిని సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. క్రిస్‌మస్ సందర్బంగా డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు. వాణీ భోజన్, బాబీ సింహా, సిమ్రన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.