ఓటీటీ ‘బిగ్ బాస్’ మొదలైంది.. కంటెస్టెంట్స్ వీరే !
ABN , First Publish Date - 2022-02-27T16:43:19+05:30 IST
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ మొత్తం 5 సీజన్స్ .. సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. యన్టీఆర్, నానీ, నాగార్జున హోస్టింగ్స్ తో తెలుగువారిని అలరించిన ఈ రియాలిటీ షో త్వరలో 6వ సీజన్ ను మొదలుపెట్టబోతోంది. అయితే అంతలోనే బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ 24 గంటలూ అలరించడానికి రెడీ అయిపోయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘బిగ్ బాస్’ ఓటీటీ వెర్షన్ నిన్న (శనివారం) నుంచి మొదలైపోయింది. టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ ఏడాదికి ఒక సీజన్ చొప్పున ప్రసారమైతే.. ఓటీటీ బిగ్ బాస్ మాత్రం ఏడాదికి రెండు సీజన్స్ తో మోత మోగించబోతోంది. నాన్ స్టాప్ ఎంటర్ టైనర్ గా దీన్ని తీసుకొచ్చారు. 84 రోజుల పాటు ప్రేక్షకులకు 24 గంటలపాటు వినోదాన్ని అందించబోతున్న ఈ షోకి ఎప్పటిలాగానే నాగార్జున హోస్ట్ చేస్తుండడం విశేషమని చెప్పాలి. నిన్న సాయంత్రం 6గంటలకు మొదలైన బిగ్ బాస్ షోలో ప్రత్యేక ఆకర్షణగా అందరికీ తెలిసిన ముఖాల్నే కంటెస్టెంట్స్ గా ఎంపిక చేశారు.

ఇక.. ముందునుంచి వస్తున్న వార్తలకు తగ్గట్టుగానే 17 మంది హౌస్ మేట్స్ ను ఈ షో లో ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ సారి ప్రత్యేకత ఏంటంటే.. వీరిలో పది మంది లేడీ కంటెస్టెంట్స్ ఉంటే.. మిగతా ఏడుగురు మేల్ కంటెస్టెంట్స్ అవడం విశేషం. ఇక ఇందులో పాల్గొంటున్న పోటీదారుల లిస్ట్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఇంతకు ముందు బిగ్ బాస్ లో పాల్గొని ఎలిమినేట్ అయిన వారు కూడా వీరిలో ఉన్నారు. అలాగే.. ఈ వెర్షన్ బిగ్ బాస్ షో అంతకు టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ ఎపిసోడ్స్ కన్నా కాస్తంత స్పైసీగా ఉండబోతోంది. దానికి తగ్గట్టుగానే ఈ షో గ్లామరస్ గా ఉండనుంది. ఇంచు మించు బాలీవుడ్ లో ప్రాసారమయ్యే బిగ్ బాస్ ఎపిసోడ్స్ తరహాలో ఇవి ఉండబోతున్నాయి. అలాగే వివాదాలకు కూడా ఈ షోలో పెద్ద పీట వెయ్యబోతున్నారని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఇక ఓటీటీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ లిస్ట్ ను చూస్తే.. అషురెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, కొత్త కుర్రోడు అజయ్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, అరియానా, నటరాజ్ మాస్టర్, శ్రీరాపాక, అనిల్ రాథోడ్, మిత్రా శర్మ, తేజస్వి, సరయు, యాంకర్ శివ, బిందు మాధవి, హవిదా, అఖిల్ సార్ధక్ ఇందులో హౌస్ మేట్స్ గా ప్రేక్షకులకు నాన్ స్టాప్ వినోదాన్ని అందించబోతున్నారు. 5వ సీజన్ ముగిసిన వెంటనే రెండు నెలల్లోనే 6వ సీజన్ కూడా మొదలు కానుందని బిగ్ బాస్ నిర్వాహకులు తెలిపినప్పటికీ.. ముందుగా ఓటీటీ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకురావడంతో .. 6వ సీజన్ కు టైమ్ పట్టేలా ఉంది. మరి టీవీ బిగ్ బాస్ కన్నా ఓటీటీ బిగ్ బాస్ ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుందేమో చూడాలి.