ఓరి దేవుడా: విష్వక్‌సేన్‌.. పెళ్లి కష్టాలు!

ABN , First Publish Date - 2021-11-09T22:37:46+05:30 IST

విష్వక్‌సేన్‌, హీరోగా, మిథిలా పాల్కర్‌, ఆశాభట్‌ హీరోయిన్లుగా నటిస్తున్న న్యూ ఏజ్‌ రొమాంటిక్‌ సినిమా ‘ఓరి దేవుడా’. అశ్వత్‌ మారిముత్తు దర్శకుడు. పి.వి.పి సినిమా బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఓరి దేవుడా: విష్వక్‌సేన్‌.. పెళ్లి కష్టాలు!

విష్వక్‌సేన్‌, హీరోగా, మిథిలా పాల్కర్‌, ఆశాభట్‌ హీరోయిన్లుగా నటిస్తున్న న్యూ ఏజ్‌ రొమాంటిక్‌  సినిమా ‘ఓరి దేవుడా’. అశ్వత్‌ మారిముత్తు దర్శకుడు. పి.వి.పి సినిమా బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. చర్చి ప్రాంగణంలో అందమైన సీతాకోక చిలుక ఎగురుతుంటుంది. దాన్ని పట్టుకోవడానికి కోటు, సూటు వేసుకున్న హీరో విష్వక్‌ ేసన్‌ ప్రయత్నిస్తుంటే ..పెళ్లి కూతురి డ్రెస్‌లో ఉన్న హీరోయిన్‌ మిథిలా పాల్కర్‌ అతన్ని ఓ తాడుతో కట్టి ఆపడానికి ప్రయత్నిస్తుంటుంది. పోస్టర్‌ చూస్తుంటే రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అని అర్థమవుతోంది. చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. మరో వైపు నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరగుతున్నాయి.  ఈ చిత్రానికి తరుణ్‌ భాస్కర్‌ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: లియోన్‌ జేమ్స్‌, సినిమాటోగ్రఫీ: విదు అయ్యన్న, ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వంశీ కాక. 


Updated Date - 2021-11-09T22:37:46+05:30 IST