ఒరేయ్ బామ్మర్ది: అక్టోబర్ 1న ఆహాలో విడుదల

ABN , First Publish Date - 2021-09-28T14:56:22+05:30 IST

సిద్దార్థ్ నటించిన సినిమా "ఒరేయ్ బామ్మర్ది". ఈ మూవీ అక్టోబర్ 1న తెలుగు ఓటీటీ ఆహాలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ పోస్టర్‌ను వదిలి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చారు.

ఒరేయ్ బామ్మర్ది: అక్టోబర్ 1న ఆహాలో విడుదల

సిద్దార్థ్ నటించిన సినిమా "ఒరేయ్ బామ్మర్ది". ఈ మూవీ అక్టోబర్ 1న తెలుగు ఓటీటీ ఆహాలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ పోస్టర్‌ను వదిలి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చారు. అటు తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగు ప్రేక్షకులకి ద‌గ్గ‌రైన హీరో సిద్ధార్థ్‌. కొన్నేళ్లుగా తెలుగు సినిమాలలో క‌నిపించ‌ని ఆయ‌న, మళ్ళీ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ‘ఒరేయ్ బామ్మ‌ర్ది’ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించబోతున్నారు. ఈ సినిమాలో సంగీత దర్శకుడు  జి.వి.ప్ర‌కాష్ మ‌రో హీరోగా న‌టించారు. ‘బిచ్చ‌గాడు’ లాంటి సూపర్ హిట్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు శ‌శి నుంచి వ‌స్తున్న 'ఒరేయ్ బామ్మర్ది' చిత్రమీద బాగానే అంచనాలున్నాయి. కాగా ఈ చిత్రాన్ని ఆహాలో అక్టోబర్ నుంచి స్ట్రీమింగ్‌కి సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.



Updated Date - 2021-09-28T14:56:22+05:30 IST