సమంత ప్రెగ్నెంటా..? ఎందుకు కొత్త చిత్రాలు అంగీకరించడం లేదు?
ABN , First Publish Date - 2021-09-16T00:16:44+05:30 IST
గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగచైతన్య, సమంతల వివాహబంధంపై విపరీతంగా రూమర్స్ వినబడుతోన్న విషయం తెలిసిందే. సమంత తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘అక్కినేని’ అని ఎప్పుడైతే తీసేసిందో.. అప్పటి నుంచి

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగచైతన్య, సమంతల వివాహబంధంపై విపరీతంగా రూమర్స్ వినబడుతోన్న విషయం తెలిసిందే. సమంత తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘అక్కినేని’ అని ఎప్పుడైతే తీసేసిందో.. అప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత నాగ్ పుట్టినరోజు వేడుకలలో కూడా ఆమె కనిపించకపోవడంతో ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూరింది. నాగచైతన్య, సమంత విడిపోతున్నారని.. త్వరలోనే వారు విడాకులు తీసుకోనున్నారనేలా.. గాసిప్స్ మొదలయ్యాయి. అయితే ఈ రూమర్స్, గాసిప్స్‌పై అక్కినేని ఫ్యామిలీగానీ, సమంత తరపు ఫ్యామిలీగానీ ఇప్పటి వరకూ స్పందించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా చైతూ, సామ్‌లపై కొత్తగా మరో రూమర్ మొదలైంది.
సమంత ప్రస్తుతం నటించిన ‘శాకుంతలం’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత ఇంత వరకు ఆమె మరో సినిమాకు సైన్ చేసినట్లుగా వార్తలైతే ఏమీ రాలేదు. పైగా ఇటీవల బాలీవుడ్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. అలాగే చైతూ నటించిన ‘లవ్ స్టోరి’ ట్రైలర్‌పై కూడా ట్విట్టర్ వేదికగా సమంత స్పందించడం, దీనికి చైతూ థ్యాంక్స్ చెప్పడం వంటివి వారిపై వస్తున్న రూమర్స్‌లో ఎటువంటి నిజం లేదనేలా చేశాయి. అయితే సమంత రెస్ట్ తీసుకోవడానికి కారణం ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అని.. అందుకే కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా ఇప్పుడు వార్తలు మొదలయ్యాయి. త్వరలోనే వారు ఓ స్వీట్ న్యూస్ చెప్పబోతున్నారని, చక్కని ఫ్యామిలీని క్రియేట్ చేసుకోబోతున్నారనేలా.. ఇప్పుడు మొదలైన ఈ రూమర్స్‌లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఇది నిజమైతే మాత్రం అక్కినేని అభిమానులంతా హ్యాపీగా ఫీలవ్వడం మాత్రం ఖాయం. మరి ఈ తాజా రూమర్స్ పైనైనా చైతూ, సమంతలలో ఎవరైనా స్పందిస్తారేమో చూద్దాం.