‘బుట్టబొమ్మ’ అకౌంట్‌లో మరో రికార్డ్.. ఏకంగా 700 మిలియన్లు
ABN , First Publish Date - 2021-11-14T03:29:34+05:30 IST
‘అల వైకుంఠపురములో’ చిత్రం విడుదలై దాదాపు దాదాపు 2 సంవత్సరాలు కావస్తోంది. అయినా కూడా ఈ చిత్రం పేరు ఏదో ఒక సందర్భంలో వినబడుతూనే ఉంది. ముఖ్యంగా ‘బుట్టబొమ్మ’ సాంగ్ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఈ పాట వరల్డ్ వైడ్‌గా

‘అల వైకుంఠపురములో’ చిత్రం విడుదలై దాదాపు దాదాపు 2 సంవత్సరాలు కావస్తోంది. అయినా కూడా ఈ చిత్రం పేరు ఏదో ఒక సందర్భంలో వినబడుతూనే ఉంది. ముఖ్యంగా ‘బుట్టబొమ్మ’ సాంగ్ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఈ పాట వరల్డ్ వైడ్‌గా క్రేజ్‌ను సొంతం చేసుకుని.. టాప్ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడీ పాట మరో మైలురాయిని చేరింది. యూట్యూబ్‌లో ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్ 700 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ పాట 700 మిలియన్ల వ్యూస్ సాధించినట్లుగా చెబుతూ.. సింగర్ ఆర్మాన్ మాలిక్ ట్వీట్ చేశారు.
అల్లు అర్జున్, పూజా హెగ్డే, సుశాంత్, నివేతా పేతురాజ్, జయరామ్, టబు, రాజేంద్రప్రసాద్, మురళీశర్మ వంటి వారు నటించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు, సంచలన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. మ్యూజిక్ సంచలనం ఎస్. ఎస్. థమన్ సంగీతం అందించారు. ఇక రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘బుట్టబొమ్మ’ పాటని రామజోగయ్య శాస్త్రి రచించగా.. ఆర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ పాటకు జానీ మాస్టర్ నృత్యాన్ని అందించారు. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలైన ఈ వీడియో సాంగ్.. రికార్డుల పరంపరను కొనసాగిస్తూనే ఉంది.