వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న కోలీవుడ్ బ్యూటీ

ABN , First Publish Date - 2021-11-18T03:30:03+05:30 IST

కోలీవుడ్‌లోని బిజీ హీరోయిన్లలో ప్రియా భవానీ శంకర్‌ ఒకరు. ఈమె వరుస మూవీ ఆఫర్లను చేజిక్కించుకుంటూ తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే పదికి పైగా చిత్రాల్లో నటిస్తున్న ప్రియా భవానీ ఇపుడు

వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న కోలీవుడ్ బ్యూటీ

కోలీవుడ్‌లోని బిజీ హీరోయిన్లలో ప్రియా భవానీ శంకర్‌ ఒకరు. ఈమె వరుస మూవీ ఆఫర్లను చేజిక్కించుకుంటూ తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే పదికి పైగా చిత్రాల్లో నటిస్తున్న ప్రియా భవానీ ఇపుడు మరో కొత్త చిత్రానికి కమిట్‌ అయినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘పెళ్ళి చూపులు’ చిత్రాన్ని తమిళంలోకి ‘ఓ మణపెన్నే’ పేరుతో రీమేక్‌ చేసి గత నెలలో ఓటీటీలో రిలీజ్‌ చేశారు. ఇందులో హరీష్‌ కళ్యాణ్‌ హీరో. ఈ చిత్రం తమిళంలో కూడా మంచి సక్సెస్‌ సాధించింది. ఇపుడు హరీష్‌ - ప్రియా భవానీ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది. డెబ్యూ డైరెక్టర్‌ కార్తీ సుందర్‌ రూపొందించే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్‌ను ఖరారు చేశారు. ఇదిలావుంటే, ఈమె చేతిలో ప్రస్తుతం ‘కురుదియాట్టం’, ‘హాస్టల్‌’, ‘రుద్రన్‌’, ‘ఇందియన్‌-2’ వంటి 10కి పైగా చిత్రాలు ఉన్నాయి. 

Updated Date - 2021-11-18T03:30:03+05:30 IST