యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ (Young Rebel Star Prabhas) నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ (Salaar).. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేటయ్యాయి. ఇక ఈ సినిమాతో పాటు తన నెక్ట్స్ ప్రాజెక్టులపై కూడా ప్రభాస్ పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ (Aadipurush) చిత్రాన్ని పూర్తి చేసిన ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ‘ప్రాజెక్ట్ K’ (Project K) షూటింగ్ మొదలు పెట్టాడు. అంతేగాక సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sundeep Reddy Vanga) డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ (Spirit) అనే సినిమాను కూడా ఇప్పటికే అనౌన్స్ చేశాడు. అవన్నీ ఒక ఎత్తు అయితే.. ఎవరి అంచనాలకు అందకుండా ఈ మధ్య మారుతి (Maruthi) డైరెక్షన్‌లో ‘రాజా డీలక్స్’ (Raja Deluxe) అనే సినిమా కూడా చేయనున్నట్లు టాక్ మొదలైంది.
టైటిల్‌తో సహా వచ్చిన సోషల్ మీడియా న్యూస్ అప్పుడే ఫ్యాన్స్‌ను ఒకింత కలవర పెట్టినా, మారుతి స్టయిల్ ఆఫ్ కామెడీ టైమింగ్‌పై ఉన్న నమ్మకంతో.. సినిమా ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చర్చించుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమాపై జరుగుతున్న చర్చ ప్రకారం.. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారట. ఆ ముగ్గురు హీరోయిన్స్‌లో ఒకరు అనుష్క శెట్టి (Anushka Shetty) అని ఇప్పటికే వైరల్ అవగా.. ఆ రూమర్ నిజమేనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు మారుతి.. అనుష్కతో చర్చలు కూడా జరిపాడట. మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ కోసం మేకర్స్ హంటింగ్ మొదలు పెట్టారనేలా వార్తలు వినబడుతున్నాయి.
(Prabhas-Anushka) ప్రభాస్-అనుష్కలది హిట్ కాంబినేషన్, పైగా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఒకే సైజ్ కటౌట్లో ఉండే వీరిద్దరూ.. ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే ‘మిర్చి’ (Mirchi) సినిమా చూపించింది. ఆ తర్వాత వచ్చిన ‘బాహుబలి’ (Bahubali)లో కూడా ప్రభాస్-అనుష్కల మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది. ఈ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని డార్లింగ్ ఫ్యాన్స్ (Darling Fans) ఎంతగానో ఆశపడుతుంటారు. అందుకే మారుతీ ఈ కాంబినేషన్ సెట్ చేసి సినిమాకు హైప్ తీసుకొచ్చే పనిలో ఉన్నాడట. అయితే.. ఈ ప్రాజెక్ట్ మొదలయ్యేది ఎప్పుడు.. అధికారికంగా ప్రకటించేది ఎప్పుడు? అన్న విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు.