‘ఒకే ఒక జీవితం’: అఖిల్‌ చేతులమీదుగా అమ్మ పాట!

ABN , First Publish Date - 2022-01-27T00:40:02+05:30 IST

శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ను అక్కినేని అఖిల్‌ విడుదల చేశారు. ఆ పాటను అక్కినేని అమలకు అంకితమిచ్చారు. శర్వానంద్‌ హీరోగా రూపొందుతున్న 30వ చిత్రమిది. శ్రీ కార్తీక్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రీతూవర్మ కథానాయిక. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రభు, ఎస్‌ ఆర్‌ ప్రకాష్‌ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

‘ఒకే ఒక జీవితం’: అఖిల్‌ చేతులమీదుగా అమ్మ పాట!

శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ను అక్కినేని అఖిల్‌ విడుదల చేశారు. ఆ పాటను అక్కినేని అమలకు అంకితమిచ్చారు. శర్వానంద్‌ హీరోగా రూపొందుతున్న 30వ చిత్రమిది. శ్రీ కార్తీక్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రీతూవర్మ కథానాయిక. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై  ఎస్‌ఆర్‌ ప్రభు, ఎస్‌ ఆర్‌ ప్రకాష్‌ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జేక్స్‌ బిజోయ్‌ ఈ చిత్రానికి స్వరకర్త. అమ్మ గొప్పదనం చెబుతూ సిరివెన్నెల సీతారామశాస్ట్రి రచించిన పాట ఇది. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ పాట హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఫ్యామిలీ డ్రామాతో రాబోతున్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రానికి సూజిత్‌ సారంగ్‌ కెమెరామెన్‌గా, తరుణ్‌ భాస్కర్‌ మాటల రచయితగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాదిలోనే విడుదల చేయడానికి చమేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2022-01-27T00:40:02+05:30 IST