Salaar : అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ షురూ.. !

ABN , First Publish Date - 2022-05-17T18:30:02+05:30 IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో పలు భారీ బడ్జెట్ చిత్రాలున్నాయి. వాటిలో ‘సలార్’ (Salaar) ఒకటి. ప్రశాంత్ నీల్ (Prashanth neel) దర్శకత్వంలో ‘కేజీఎఫ్’ (KGF) సిరీస్‌ను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) వారు ఈ చిత్రాన్ని అత్యంత భారీగా రూ. 200కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Salaar : అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ షురూ.. !

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో పలు భారీ బడ్జెట్ చిత్రాలున్నాయి. వాటిలో ‘సలార్’ (Salaar) ఒకటి.  ప్రశాంత్ నీల్ (Prashanth neel)  దర్శకత్వంలో ‘కేజీఎఫ్’ (KGF) సిరీస్‌ను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) వారు ఈ చిత్రాన్ని అత్యంత భారీగా రూ. 200కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తమిళ స్టార్ డాటర్ శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. మధు గురుస్వామి, ఈశ్వరీరావు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్  రవి బస్రూర్ (Ravi Basrur) సంగీతం అందిస్తున్నారు. దాదాపు 30 శాతం షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ షూట్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి అభిమానులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడానికి మేకర్స్.. ‘సలార్’ కోసం ఓ ప్రత్యేక ట్విట్టర్ హ్యాండిల్‌ను రూపొందించారు. ‘Salaar the saga’ పేరుతో ఉన్న ఈ  ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ‘సలార్’ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి.


ఇటీవల ‘కేజీఎఫ్ 2’ చిత్రం సంచలన విజయం సాధించడంతో.. అదే దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth neel) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రభాస్ ‘సలార్’ (Salaar) చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో వరుసగా అభిమానుల్ని నిరాశపరిచిన ప్రభాస్.. ఈ సినిమాతో కచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ కొడతాడని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ‘సలార్’ చిత్రాన్ని ష్యూర్ షాట్ హిట్‌గా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కాబోతున్న సలార్ చిత్రం ప్రభాస్ కు ఏ తరహా విజయాన్ని అందిస్తుందో చూడాలి.   



Updated Date - 2022-05-17T18:30:02+05:30 IST