#NTR31: 'KGF' ను మించి ఉంటుంది: తారక్

తన 31వ సినిమా 'కేజీఎఫ్‌'ను మించి ఉంటుందని ఎన్టీఆర్ చెబుతున్నాడు. ఇటీవల 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని పూర్తిచేసిన తారక్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళాడు. అక్కడినుంచి రాగానే నెక్స్ట్ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ 30గా తెరకెక్కనుంది. దీని తర్వాత 'కేజీఎఫ్' చిత్రాల దర్శకుడు పశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ సినిమాగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్ట్స్‌ను కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ 31 'కేజీఎఫ్‌'ను మించి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని ఇటీవల ఓ ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా తారక్ వెల్లడించాడు. దాంతో అభిమానులు భారీస్థాయిలో ఇప్పటి నుంచే ఈ సినిమాను ఊహించుకుంటున్నారు. కాగా, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటించిన పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్' 2022, జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ - చరణ్‌లకు పాన్ ఇండియన్ స్టార్స్‌గా భారీ క్రేజ్ రావడం పక్కా అని అందరూ చెప్పుకుంటున్నారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.