నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బింబిసార (Bimbisara). నేడు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ సోదరుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఈ మూవీ యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వరుస ట్వీట్స్ పెట్టారు. వీటిలో ఆయన.. "బింబిసార అద్భుతాలు చేస్తోందని వింటున్నాను. సినిమాని మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులు ఎంతో ఉద్వేగంతో, ఎనలేని ఉత్సాహంతో చూస్తున్నారన్న వార్తలు ఎంతో ఆనందానిస్తాయి"..అని ఓ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
అలాగే, మరో పోస్ట్‌లో.. "నందమూరి కళ్యాణ్ అన్నయ్యా! బింబిసార చక్రవర్తిగా నీ నటనకి సాటి మరొకరు లేరు. ఎంతో తలపండిన అనుభవజ్ఞుడిలా దర్శకుడు వశిష్ట ఈ సినిమాని తీర్చిదిద్దారు. లెజెండరీ సంగీత దర్శకులు కీరవాణి ఈ సినిమాకి వెన్నెముక అని చెప్పొచ్చు. ఈ ఘనవిజయానికి కారకులైన నటీనటులు, టెక్నీషియన్లకి నా అభినందనలు"..ని పేర్కొన్నారు.
ఈ సినిమాతో మల్లిడి వశిష్ట్ (Mallidi Vashist) టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అఅయ్యాడు. క్యాథరీన్ థ్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon), వరీన హుస్సేన్ (Warina Hussain) ఇందులో హీరోయిన్స్‌గా నటించారు. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో.. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్ వస్తోంది.
ఇటీవల కాలంలో కళ్యాణ్ రామ్ కి సరైన హిట్ దక్కలేదు. 2020లో నటించిన ఎంతమంచివాడవురా సినిమా తన ఖాతాలో ఫ్లాప్‌గా చేరింది. దాంతో దాదాపు రెండేళ్ళ పాటు కష్టపడి బింబిసారా చిత్రంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికైతే అందరు బింబిసార హిట్ అనే చెబుతున్నారు. మరి లాంగ్ రన్‌లో ఎలాంటి టాక్ వస్తుందో వేచి చూడాలి.