తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ, నేటికీ, ముమ్మాటికీ ధ్రువ తార మీరే : యన్టీఆర్

ABN , First Publish Date - 2022-01-18T16:21:54+05:30 IST

తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేసిన మహానటుడు నందమూరి తారక రామారావు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయన ఎప్పుడూ చిరస్మరణీయుడు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో.. విలక్షణమైన పాత్రలతో తెలుగు తెరపై విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా వెలుగొందిన ఆయన వర్ధంతి నేడు. రూపురేఖల్లోనూ, నటనలోనూ సరిగ్గా ఆయన పోలికల్నే పుణికి పుచ్చుకున్న ఆయన మనవడు యన్టీఆర్ తన తాతను తలుచుకుంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.

తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ, నేటికీ, ముమ్మాటికీ ధ్రువ తార మీరే :  యన్టీఆర్

తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేసిన మహానటుడు నందమూరి తారక రామారావు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయన ఎప్పుడూ చిరస్మరణీయుడు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో.. విలక్షణమైన పాత్రలతో తెలుగు తెరపై విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా వెలుగొందిన ఆయన వర్ధంతి నేడు. రూపురేఖల్లోనూ, నటనలోనూ సరిగ్గా ఆయన పోలికల్నే పుణికి పుచ్చుకున్న ఆయన మనవడు యన్టీఆర్ తన తాతను తలుచుకుంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.  


‘తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ, నేటికీ, ముమ్మాటికీ ధ్రువ తార మీరే’ అంటూ యన్టీఆర్ తన తాతను గుర్తుచేసుకున్నారు. ఆయనతో యన్టీఆర్ కు మంచి బాండింగ్ ఉండేది. జూనియర్ యన్టీఆర్ ను తాత అంటూ ముద్దు చేసేవారు ఆయన. ఆయన పట్ల ఎనలేని అభిమానం, గౌరవం కలిగి ఉండే తారక్ కు ఆయనే ఇన్స్పిరేషన్. 1996, జనవరి 18న కన్నుమూశారు యన్టీఆర్. తెలుగు ప్రేక్షకులకు ఆయనో జ్ఞాపకంగా మారి అప్పుడే 26 ఏళ్ళయిపోయింది. 



Updated Date - 2022-01-18T16:21:54+05:30 IST