విశ్రాంతిలో ఎన్టీఆర్?
ABN , First Publish Date - 2022-08-08T06:16:26+05:30 IST
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నారు. అయితే సినిమా షూటింగ్స్‌కు ఎన్టీఆర్ చిన్న బ్రేక్ ఇచ్చారట....

‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నారు. అయితే సినిమా షూటింగ్స్‌కు ఎన్టీఆర్ చిన్న బ్రేక్ ఇచ్చారట. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని టాలీవుడ్ సమాచారం. కొంతకాలంగా ఆయన భుజం నొప్పితో బాధపడటమే దీనికి కారణంగా చెబుతున్నారు. వైద్యులు నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరమని చెప్పడంతో చిత్రీకరణకు ఆయన స్వల్ప విరామం ఇచ్చారని తెలుస్తోంది. కొరటాల శివతో ఎన్టీఆర్ చేయబోయే సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు మరికొంత సమయం పట్టొచ్చు. దీంతోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఆయన ఒక సినిమా చేయాల్సి ఉంది.