NTR 31: బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఫైనల్..?

Twitter IconWatsapp IconFacebook Icon
NTR 31: బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఫైనల్..?

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ హిట్ అందుకున్న ఎన్టీఆర్ (NTR) ఇటీవలే తన నెక్స్ట్ సినిమాలను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ రెండవసారి నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్‌లో 30వ సినిమా. యువసుధ ఆర్ట్స్ (Yuvasudha Arts), ఎన్టీఆర్ ఆర్ట్స్ (NTR Arts) పతాకాలపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో నిర్మించబోతున్నారు. ఈ మూవీలో తారక్‌ను కొరటాల ఇప్పటి వరకు చూడని ఓ పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నారట. అంతేకాదు, ఎన్టీఆర్ 30లోని ఇంట్రవెల్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్ అని ఆ రేంజ్‌లో కొరటాల భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారని వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే కేజీఎఫ్ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్. యాక్షన్ సీన్స్ తెరకెక్కించడంలో ఆయనది ఓ డిఫరెంట్ స్టైల్ అని, ఇలాంటి యాక్షన్ సినిమా పడితే ఏ హీరోకైనా ఇమేజ్ మరో లెవల్‌కు వెళుతుందని అభిమానులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 'సలార్‌'ను రూపొందిస్తున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

అయితే, సలార్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా మరో హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాను రూపొందించబోతున్నారు ప్రశాంత్ నీల్. ఇప్పటికే, ఎన్టీఆర్ 31 సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు. ఈ పోస్టర్‌తోనే అంచనాలు భారీగా మొదలయ్యాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మూవీ సెట్స్‌పైకి రాబోతోంది. ఇంకా చాలానెలలు సమయం ఉంది. అయినా కూడా ఎన్టీఆర్ 31 కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janvi Kapoor)ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే, జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని పలుమార్లు వార్తలు వచ్చాయి. కానీ, అవన్నీ గాసిప్స్‌గానే మిగిలాయి. మరి ఎన్టీఆర్ 31తో అయినా తెలుగుతెరపై కనిపిస్తుందా లేదా చూడాలి. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.