NTR 30: అందుకే ఆలస్యం..?

ABN , First Publish Date - 2022-08-07T19:06:50+05:30 IST

రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) పాన్ ఇండియన్ స్టార్‌గా మారారు. ఈ సినిమా తర్వాత వెంటనే సినిమాని ప్రారంభించాలనుకున్నారు.

NTR 30: అందుకే ఆలస్యం..?

రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) పాన్ ఇండియన్ స్టార్‌గా మారారు. ఈ సినిమా తర్వాత వెంటనే సినిమాని ప్రారంభించాలనుకున్నారు. కానీ, ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి బాగా ఆలస్యం అవుతోంది. దీనికి కారణం కొరటాల శివ (Koratala Siva)కి ఆచార్య సినిమా ఫ్లాప్‌గా మిగలడమే. ఈ సినిమా ఆయనని తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో ఆ మూడ్ నుంచి కొరటాల బయటకి రావడానికి చాలా సమయం పట్టింది. అయితే, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్ తర్వాత తారక్ నుంచి వచ్చే సినిమాపై అందరిలో అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి.


అందుకే, కొరటాల ముందు అనుకున్న కథలో చాలా మార్పులు చేస్తున్నారట. అధికారికంగా ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ సెట్స్ మీదకి తీసుకు రాలేకపోతున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ 30 ఇలా ఆలస్యం కావడానికి మరో ముఖ్య కారణం కూడా ఉందట. ఒకవైపు కొరటాల స్క్రిప్ట్ మీద చాలా సీరియస్‌గా వర్క్ చేస్తుంటే..తారక్ భుజం నొప్పితో బాధపడుతూ డాక్టర్ల సలహా మేరకు రెస్ట్ తీసుకుంటున్నారట. ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలో తారక్ భారీ యాక్షన్ సీన్స్‌లో పాల్గొన్నారు. 


ఆ ప్రభావం తీవ్రంగా పడి భుజం నొప్పితో బాధపడుతున్నారట. నాలుగు వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సిందేనని డాక్టర్లు చెప్పారట. ఈ కారణాలతోనే ఎన్టీఆర్ 30 అక్టోబర్ వరకు చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో రిలీజ్ డేట్‌ని ఎప్పుడు ప్రకటిస్తారో. ఇక తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ భారీ యాక్షన్ సినిమా మొదలవ్వాల్సి  ఉంది. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. మైత్రీ మువీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

Updated Date - 2022-08-07T19:06:50+05:30 IST