NTR : ఒకే సారి రెండు సినిమాలు?

ABN , First Publish Date - 2022-01-04T20:50:45+05:30 IST

‘అరవింద సమేత’ చిత్రం తర్వాత యంగ్ టైగర్ యన్టీఆర్ నుంచి మరో సినిమా రాలేదు. ఆ సినిమా విడుదలవగానే.. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకే పూర్తిగా అంకితమైపోయాడు. 2021లో రిలీజ్ అవుతుందనుకున్న ఆ సినిమా విడుదలకు కరోనా పలుమార్లు అడ్డం పడింది. ఈ ఏడాది జనవరి 7 న విడుదలవుతుందని అనుకుంటే దానికి కూడా అదే కారణం అయింది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయంలో రాజమౌళి ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఏడాది ‘ఆర్.ఆర్.ఆర్’ బ్లాక్ బస్టర్ తో జైత్రయాత్ర మొదలుపెట్టాలనుకున్న యన్టీఆర్ కు తీవ్ర నిరాశ ఎదురైంది.

NTR : ఒకే సారి రెండు సినిమాలు?

‘అరవింద సమేత’ చిత్రం తర్వాత యంగ్ టైగర్ యన్టీఆర్ నుంచి మరో సినిమా రాలేదు. ఆ సినిమా విడుదలవగానే.. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకే పూర్తిగా అంకితమైపోయాడు. 2021లో సినిమా విడుదలకు కరోనా పలుమార్లు అడ్డం పడింది. ఈ ఏడాది జనవరి 7 న విడుదలవుతుందని అనుకుంటే దానికి కూడా అదే కారణం అయింది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయంలో రాజమౌళి ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఏడాది ‘ఆర్.ఆర్.ఆర్’ బ్లాక్ బస్టర్ తో జైత్రయాత్ర మొదలుపెట్టాలనుకున్న యన్టీఆర్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా రిజల్ట్ తెలియకుండానే కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు యన్టీఆర్. ఈ నెల్లోనే సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంఛ్ కాబోతోంది. 


అయితే ఈ సినిమాతో పాటు మరో చిత్రాన్ని కూడా యన్టీఆర్ మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం. ‘ఉప్పెన’తో సెన్సేషనల్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సాన చాలా రోజులుగా యన్టీఆర్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే స్ర్కిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ చేసి యన్టీఆర్ కు వినిపించడం కూడా జరిగిపోయిందట. యన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది కానీ.. సినిమాను ఎప్పుడు మొదలు పెట్టాలనే విషయంలో క్లారిటీ లేక సైలెంట్ గా ఉండిపోయారట. ఇప్పుడు కొరటాల శివ సినిమాతో పాటు బుచ్చిబాబు సినిమాను కూడా మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యారట. బౌండెడ్ స్ర్కిప్ట్ రెడీగా ఉండడంతో పక్కా ప్లానింగ్ తో సినిమా పూర్తి చేయాలనుకుంటున్నాడట బుచ్చిబాబు. కొరటాల సినిమా తెరకెక్కిన ఒకటి రెండు నెలల్లో బుచ్చిబాబు సినిమా కూడా సెట్స్ పైకి వెళుతుందట. 

Updated Date - 2022-01-04T20:50:45+05:30 IST