కలిసినా కనిపెట్టలేదు

ABN , First Publish Date - 2021-07-19T09:17:52+05:30 IST

కొన్ని రకాల పాత్రల కోసం హీరోలు తమ ఆహార్యంలో పూర్తి మార్పులు చేయడం మామూలే.కానీ కొత్త అవతారంలో ఎదురుగా నిల్చుంటే షూటింగ్‌ లొకేషన్‌లో ఉన్నవాళ్లు కూడా ఆ హీరోను గుర్తుపట్టలేకపోవడం...

కలిసినా కనిపెట్టలేదు

కొన్ని రకాల పాత్రల కోసం హీరోలు తమ ఆహార్యంలో పూర్తి మార్పులు చేయడం మామూలే.కానీ కొత్త అవతారంలో ఎదురుగా నిల్చుంటే షూటింగ్‌ లొకేషన్‌లో ఉన్నవాళ్లు కూడా ఆ హీరోను గుర్తుపట్టలేకపోవడం విశేషమే. తమిళ హీరో కార్తికి తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రస్తుతం విజయ్‌ హీరోగా నటిస్తున్న ‘బీస్ట్‌’, కార్తి కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్దార్‌’ సినిమాల షూటింగ్‌ చెన్నైలోని ఓ ప్రైవేట్‌ స్టూడియోలో వేర్వేరు ఫ్లోర్లలో జరుగుతున్నాయి. పక్కపక్కనే రెండు సినిమాల షూటింగ్‌ జరుగుతుంటే హీరోలిద్దరూ కలుసుకోవడం సాధారణంగా జరిగేదే. విజయ్‌ సెట్‌లో ఉన్నాడని తెలిసి కార్తి అతన్ని కలిసేందుకు వెళ్లాడు. అయితే అప్పటికే కార్తీ ‘సర్దార్‌’ చిత్రం కోసం మేకప్‌ వేసుకొన్నారు. పూర్తిగా కొత్తలుక్‌లో ఉండడంతో ‘బీస్ట్‌’ సెట్‌లో 15 నిమిషాలు తిరిగినా అక్కడ ఉన్నవాళ్లలో ఒక్కరు కూడా కార్తిని గుర్తుపట్టలేకపోయారు. కొంచెంసేపటి తర్వాత కార్తి విజయ్‌ దగ్గరకు వెళ్లి పలకరించాడట. విజయ్‌ కూడా కార్తిని గుర్తుపట్టలేకపోయాడు. ‘నేను కార్తిని’ అని స్వయంగా చెప్పటంతో ఆశ్చర్యపోవడం విజయ్‌ వంతైంది.  చాలా రోజుల తర్వాత కలవడంతోకార్తి, విజయ్‌ ఇద్దరూ తమ సినిమాల గురించి అరగంట సేపు మాట్లాడుకున్నారు. 


Updated Date - 2021-07-19T09:17:52+05:30 IST