Nene Vastunna film review: ఈ అన్నదమ్ములు అంతగా ఆకట్టుకోలేకపోయారు

ABN , First Publish Date - 2022-09-29T18:47:41+05:30 IST

ధనుష్ మరొక తమిళ్ సినిమా తెలుగులోకి 'నేనే వస్తున్నా' అన్న పేరు మీద డబ్బింగ్ అయి విడుదల అయింది.

Nene Vastunna film review: ఈ అన్నదమ్ములు అంతగా ఆకట్టుకోలేకపోయారు

Nene Vastunna film review: ఈ అన్నదమ్ములు అంతగా ఆకట్టుకోలేకపోయారు 

సినిమా: నేనే వస్తున్నా 

నటీనటులు: ధనుష్ (Dhanush), ఇందూజ రవిచంద్రన్ (Induja Ravichandran), ప్రభు, యోగి, ఎలీ అవ్రామ్‌ తదితరులు 

సినిమాటోగ్రాఫర్: ఓం ప్రకాష్ 

సంగీతం: యువన్ శంకర్ రాజా (Yuvan Sankar Raja)

నిర్మాత: కలైపులి ఎస్ థాను (Kalaipuli S Thanu)


సురేష్ కవిరాయని 

ధనుష్ మరొక తమిళ్ సినిమా తెలుగులోకి 'నేనే వస్తున్నా' అన్న పేరు మీద డబ్బింగ్ అయి విడుదల అయింది. అంతకు ముందు లాగే ఈ సినిమాకి కూడా ధనుష్ తెలుగు లో ప్రమోషన్స్ ఏమి చెయ్యలేదు. ఈ సినిమా దర్శకుడు సెల్వరాఘవన్, ధనుష్కి (Dhanush brother Selvaraghavan) స్వయానా అన్న . వీళ్లిద్దరు చాలా కాలం తరువాత మళ్ళీ ఈ సినిమా కోసం కలిశారు. ఇందులో ధనుష్ డ్యూయల్ రోల్ చేసాడు. మరి ఈ సినిమా  ఎలా వుందో చూద్దాం. 


కథ:

ప్రభు (ధనుష్) మంచి వుద్యోగం చేసుకుంటూ భార్య భువన (ఇందూజ రవిచంద్రన్), కూతురు కావ్య తో సంతోషంగా ఉంటూ ఉంటాడు. ఒకరోజు కూతురు తన రూమ్ లో ఎవరితోనో మాట్లాడటం ప్రభు చూస్తాడు. కూతురు  ఎవరితో మాట్లాడుతున్నది ఎవరికీ కనపడదు, కానీ ఒక్క ఆమెకి తప్ప. డాక్టర్ కి కూడా చూపిస్తాడు, కానీ కావ్య ఆ అదృశ్య వ్యక్తి తో మాట్లాడటం జరుగుతూనే ఉంటుంది. తన కూతురు ని ఆవహించింది సోను అనే వ్యక్తి  అని, కూతురిని వదిలి పోవాలంటే ఏమి చెయ్యాలని అడుగుతాడు. కదిర్ అనే వ్యక్తిని చంపాలని, అతన్ని చంపిన వెంటనే కూతుర్ని వదిలి వెళ్ళిపోతాను అని చెప్తాడు కూతుర్ని ఆవహించిన వ్యక్తి. కదిర్ పేరు వినగానే ప్రభు ఒక్కసారిగా వణికిపోతాడు. ఎవరా కదిర్? ప్రభు కి అతనికి  ఏంటి సంబంధం, సోను ఎవరు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


విశ్లేషణ:

దర్శకుడు సెల్వ రాఘవన్ (Selva Raghavan) కొంచెం విభిన్నమయిన (Different concepts) కథలను ఎంచుకుంటాడు, అందుకనే అతని సినిమాలంటే  ఆసక్తి ఉంటుంది. ఈ 'నేనే వస్తున్నా' (Nene Vastunna) సినిమా ఓ సైకాలజీ థ్రిల్లర్ గా చేసాడు సెల్వరాఘవన్. దానికి తోడు సెల్వ మరియు ధనుష్ ఇద్దరు అన్నదమ్ములు కదా, వాళ్లిద్దరూ చాల కాలం తరువాత కలిసి సినిమా చేశారేమో అందుకని తమిళ్ లో ఈ సినిమా కోసం ఎదురు చూశారేమో కానీ, తెలుగు లో అయితే అసలు ప్రమోషన్స్ లేవు. ఎవరికీ తెలియదు కూడా ఈ సినిమా విడుదల సంగతి. అది ఆలా  ఉంచితే, అన్నదమ్ములు ఇద్దరూ  ఎదో టైం పాస్ కోసం ఈ సినిమా చేసినట్టు కనపడుతోంది. అంతే కానీ,  సినిమాలో పెద్దగా విషయం లేదు. ఇద్దరు అన్నదమ్ములు, అందులో ఒకడు సైకిక్ అయి, విడిపోతారు. పెద్దయ్యాక ఇద్దరు అన్నదమ్ములు మళ్ళీ ఒక పాయింట్ దగ్గర కలుస్తారు. ఇలాంటి కథలు తమిళ్ లోనే చాలా వచ్చాయి.  అందుకని కథ కొంచెం సాగదీసి చూపాలి, ఆ ఇద్దరు కలిసేవరకు. దర్శకుడు ఎంచుకున్న సబ్జెక్టు లో దమ్ము లేదు. అంత ఎఫెక్టివ్ గ చూపించలేదు. సెల్వరాఘవన్ ముందు సినిమాల్లో భావోద్వేగాలు  బాగుంటాయి, కానీ ఈ సినిమాలో అది లోపించింది. అందుకే సినిమా అక్కడక్కడా బాగున్నా, మొత్తం మీద పేలవంగానే వుంది. పెద్దగా కేరక్టర్స్ కూడా ఏమి లేవు, ఎక్కువ ధనుష్ మీదే ఆధార పది వుంది. షూటింగ్ కూడా ఒకటి రెండు ప్రదేశాల్లో అయిపోగొట్టేసారు. పెద్దగా ఖర్చు కూడా అయి ఉండదు. అందుకేనేమో ప్రచారాలు ఎక్కువ చెయ్యలేదు తెలుగులో. 


ఇంక నటీనటుల విషయానికి వస్తే, సినిమా అంతా ధనుష్ మీదే ఆధారపడి వుంది. ధనుష్ రెండు పాత్రల్లో కనపడతాడు. నెగటివ్ పాత్ర మామూలుగానే అందరికి నచ్చుతుంది  కాబట్టి, ఇందులో ధనుష్ నెగటివ్ రోల్ బాగా రాసాడు, చేసాడు కూడా. ధనుష్ మళ్ళీ తాను మంచి నటుడు అని ప్రూవ్ చేసుకునే అవసరం లేదు కాబట్టి, రెండూ    బాగానే చేసాడు. ఎలీ అవ్రామ్‌  (Elli Avram) రెండో సగం లో వస్తుంది, మూగ అమ్మాయి లా బాగా చేసింది. ఇందూజ రవిచంద్రన్ ఇంకో కథానాయిక, ఆమె కూడా పరవాలేదు. ఇంకా ప్రభు (Actor Prabhu) ఒక చిన్న రోల్ లో కనపడతాడు. పిల్లలు గా వేసిన వాళ్ళు అందరూ బాగా చేసారు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ అంతగా లేదు, ఆలా అని మరీ థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా లేవు. అక్కడక్క రెండు మూడు సీన్స్ బాగా తీసాడు. యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja music) బ్యాక్ గ్రౌండ్ (Background music) సంగీతం పరవాలేదు అన్నట్టుగా వుంది.  

ఇప్పుడు ప్రతి సినిమా ఓటిటి లోకి  వచ్చే ముందు థియేటర్ లో విడుదల చెయ్యాలన్న షరతు వుంది కాబట్టి తెలుగులో విడుదల చేసారు అనిపిస్తోంది. ఓపెనింగ్స్ అసలు లేనే లేవు. ఒక మంచి విషయం ఏంటి అంటే, ధనుష్ అంత పెద్ద స్టార్ అయినా, సంవత్సరానికి తనవి నాలుగు అయిదు సినిమాలు విడుదల చేస్తున్నాడు. అలాగే సినిమా సినిమా కి తన క్యారక్టర్ లో వైవిద్యం కూడా చూసుకుంటున్నాడు. సెల్వ మరియు ధనుష్ ఎదో టైం పాస్ కోసం ఈ సినిమా చేసి, ఓటిటి కి ఇచ్చేస్తే. మంచి డబ్బులు వస్తాయి అన్న ప్లాన్ మీద ఈ సినిమా చేసి ఉండొచ్చు అని అనిపిస్తోంది. చివరగా, 'నేనే వస్తున్నా' సినిమాలో విషయం పెద్దగా లేదు. 

Updated Date - 2022-09-29T18:47:41+05:30 IST