వెబ్‌సిరీస్‌ను స్మగ్లింగ్ చేసినందుకు... మరణదండన!

సౌత్ కొరియాలో మొదలై ప్రపంచాన్ని సర్‌ప్రైజ్ చేసిన సర్వైవల్ థ్రిల్లర్, హారర్ డ్రామా... ‘స్క్విడ్ గేమ్’. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్ పెద్ద సెన్సేషన్ అయింది. అయితే, అదే ఉత్తర కొరియాలో ఒక వ్యక్తి చావుకి కారణమైంది!


నియంత కిమ్ పాలనలో మగ్గుతోన్న నార్త్ కొరియాలో శిక్షలు కఠినంగా అవుతాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే, ఎంత దారుణంగా అన్నది మాత్రం ఇప్పుడు మరోసారి బయటపడింది. సౌత్ కొరియన్ షో ‘స్క్విడ్ గేమ్’ ఓ యూఎస్‌బీలో ఒక నార్త్ కొరియన్ చైనా నుంచీ స్మగ్లింగ్ చేశాడు. అది కొందరు హై స్కూల్ విద్యార్థులకి అక్రమంగా అమ్మాడు. వారు దాన్ని చూస్తుండగా అధికారులకి పట్టుబడ్డారు!


తమకు ‘స్క్విడ్ గేమ్’ చూస్తూ దొరికిపోయిన స్టూడెంట్స్‌ని ఆరా తీయగా అధికారులకి అసలు వ్యక్తి వివరాలు తెలిశాయి. చైనా నుంచీ యూఎస్‌బీలో ‘స్క్విడ్ గేమ్’ స్మగ్లింగ్ చేసిన సదరు ఉత్తర కొరియా పౌరుడ్ని అక్కడి అధికారులు కోర్టు ముందు హాజరుపరుచగా మరణదండన ఖరారైంది. ఈ విషయం ‘రేడియో ఫ్రీ ఏషియా’ తెలియజేసింది. స్మగ్లింగ్ చేయబడిన వెబ్ సిరీస్‌ని ఖరీదు చేసిన ఓ విద్యార్థికి కూడా జీవిత ఖైదు విధించారట! 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.