అసాధారణ ప్రయాణం

ABN , First Publish Date - 2021-11-28T08:22:53+05:30 IST

భారత క్రికెట్‌ జట్టును విశ్వవిజేతగా నిలబెట్టిన సంవత్సరం 1983. అయితే ఆ విజయం అంత సులభంగా దక్కలేదు....

అసాధారణ ప్రయాణం

భారత క్రికెట్‌ జట్టును విశ్వవిజేతగా నిలబెట్టిన సంవత్సరం 1983. అయితే ఆ విజయం అంత సులభంగా దక్కలేదు. ఎన్నో ఉత్కంఠమైన మలుపులతో దక్కిన గెలుపు అది. అటువంటి అసాధారణ ప్రయాణాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం ‘83’. కపీల్‌దేవ్‌గా రణవీర్‌ సింగ్‌, ఆయన సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకొనే, సునీల్‌ గవాస్కర్‌గా తాహిర్‌ రాజ్‌ బాసిన్‌ నటించిన ఈ చిత్రానికి కబీర్‌ఖాన్‌ దర్శకుడు. ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. గూస్‌ బంప్స్‌ తెప్పించే సన్నివేశాలు చిత్రంలో చాలా ఉన్నాయనీ, డిసెంబర్‌ 24న విడుదల చేస్తున్నామనీ నిర్మాతలు తెలిపారు. 

కబీర్‌ఖాన్‌, దీపికా పదుకొనే, సాజిద్‌ నడియాద్‌వాలా, నిఖిల్‌ ద్వివేది, విష్ణు ఇందూరి ఈ చిత్రానికి నిర్మాతలు.

Updated Date - 2021-11-28T08:22:53+05:30 IST