Super Machi: మెగా అల్లుడికి.. మెగా హీరోల సపోర్ట్ ఏది?

మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన చిత్రం ‘సూపర్ మచ్చి’. ఈ చిత్రం జనవరి 14న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క మెగా హీరో కూడా మాట్లాడకపోవడం విశేషం. మరో వైపు ‘హీరో’, ‘రౌడీ బాయ్స్’ చిత్రాల ప్రచార జోరు హోరెత్తిపోతుంటే.. మెగా ఫ్యామిలీకి చెందిన కల్యాణ్ దేవ్ సినిమా సౌండ్ మాత్రం ఎక్కడా వినబడటం లేదు. మెగా స్టాంప్ లేకుండా తనని తాను నిరూపించుకోవాలని కల్యాణ్ దేవ్ అనుకున్నాడో.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ.. ఇప్పటి వరకు ఒక్క మెగా హీరో కూడా ఈ సినిమా చూడమని ప్రేక్షకులని కోరలేదు. 


‘హీరో’, ‘రౌడీ బాయ్స్’ చిత్రాలకు మాత్రం మెగా హీరోలు తమ మద్దతు తెలుపుతూ.. ఆ సినిమాలకు సంబంధించిన అనేక ఫంక్షన్లకు కూడా హాజరవుతుండటం గమనార్హం. కాగా, రచిత రామ్ హీరోయిన్‌గా నటించిన ఈ ‘సూపర్ మచ్చి’ సినిమాను రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మించగా.. ఈ సినిమాతో పులి వాసు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.