Nivin Pauly : ఆసక్తికరంగా ‘తురముఖం’ మూవీ ట్రైలర్

Twitter IconWatsapp IconFacebook Icon
Nivin Pauly : ఆసక్తికరంగా తురముఖం మూవీ ట్రైలర్

మాలీవుడ్ యంగ్ సూపర్‌స్టార్స్‌లో నివీన్ పాలీ ( Nivin Pauly ) చాలా ప్రత్యేకం.  వైవిధ్యమైన కథాంశాలతో, విలక్షణమైన పాత్రలతో మెప్పించే ఈ హీరో..  తాజాగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘తురముఖం’ (Thuramukham) (నౌకాశ్రయం). రాజీవ్ రవి (Rajiv Ravi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తెక్కేపేట్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంది. నిమిషా సజయన్ , జోజు జార్జ్, ఇంద్రజిత్ సుకుమారన్, సుదేవ్ నాయర్, దర్శనా రాజేంద్రన్, అర్జున్ అశోకన్, మణికంఠన్ ఆచారి, సెంథిల్ కృష్ణ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కరోనా కారణంగా చాలా ఆలస్యంగా థియేటర్స్ లోకి వస్తోంది. జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. అభిమానుల్ని ఎంతగానే ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


కేయం చిదంబరం (KM Chidambaram) రచించిన ‘తురముఖం’ (Thuramukham) నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కేరళలోని కొచ్చి సముద్రతీరాన్ని, నౌకాశ్రయాన్ని నమ్ముకొని ఎందరో బతుకుంటారు. అలాంటి వాళ్ళను అణగద్రొక్కే ప్రయత్నం చేస్తూ, వారి వ్యాపారాన్ని చేసుకోనివ్వకుండా, ఇబ్బందులు పెట్టే బడా వ్యాపారస్తులపై తిరుగుబాటు చేస్తాడు ఓ యువకుడు. చివరికి ఆ నౌకాశ్రయం ఎవరి సొత్తు అయింది ? అన్నదే మిగతా కథ. 40ల్లో కొచ్చీలోని మట్టాంచేరీలో జరిగిన యదార్ధ సంఘటనల సమాహారమే ఈ సినిమా. మాట్టాంచేరీ మౌదుగా నివీన్ పాలీ నటిస్తున్న ఈ సినిమాకి కె, షహనాజ్ అమన్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ పాలీ (Nivin Pauly) కి ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చిపెడుతుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. మరి ఈ సినిమాతో నివీన్ ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటాడో చూడాలి. 


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.