నివేదా పెతురాజ్ డిజిటల్ ఎంట్రీ

ABN , First Publish Date - 2022-02-08T20:33:30+05:30 IST

‘మెంటల్ మదిలో, చిత్రలహరి, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్’ లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తన టాలెంట్ నిరూపించుకుంది నివేదా పెతురాజ్. త్వరలో ‘విరాటపర్వం’ చిత్రంతో రాబోతోంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉంటే.. నివేదా ‘బ్లడీమేరీ’ అనే వైవిధ్యమైన చిత్రంతో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన నిన్న (సోమవారం) వెలువడింది. ‘కార్తికేయ, ప్రేమమ్, సవ్యసాచి’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న చందుమొండేటి దీనికి దర్శకుడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ సినిమా డైరెక్ట్ గా విడుదల కాబోతోంది.

‘చెడుకు ఆమె మహా‌చెడ్డది’ అనే కేప్షన్ తో ‘బ్లడీమేరీ’ పోస్టర్ ను విడుదల చేశారు. నివేదా పెతురాజ్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. మేరీని కలవడానికి, కలిసి ఆమె గురించి తెలుసుకోడానికి సిద్ధంగా ఉండండని మేకర్స్ తెలిపారు. మేరీ తనలోని లోపాల్ని అధిగమించి, తనకు ఎదురైన సమస్యలతో ఎలా పోరాటం చేసింది? తనవారిని రక్షించుకోడానికి ఎంతదూరం వెళ్లిందనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. కిరీటి దామరాజు, రాజ్ కుమార్ కసిరెడ్డి, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది. ‘కుడిఎడమైతే’ అనే సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది.   

Updated Date - 2022-02-08T20:33:30+05:30 IST