Nitya Menon : పెళ్ళిపీటలెక్కబోతోందా?

Twitter IconWatsapp IconFacebook Icon
Nitya Menon : పెళ్ళిపీటలెక్కబోతోందా?

ఆకర్షించే అందం, ఆకట్టుకొనే అభినయం మెండుగా, నిండుగా కలిగిన సుందరీ మణులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటివారి జాబితాలో ఎప్పుడూ ఉండే ఒక పేరు నిత్యామీనన్ (Nithya Menon). మలయాళీ అయినప్పటికీ.. తెలుగు నేర్చుకొని మరీ, తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకొనే స్థాయికి ఎదిగింది ఆమె. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించి మెప్పించగలిగే టాలెంట్ ఆమె సొంతం. ముందు నుంచీ గ్లామర్ పాత్రలపై ఎలాంటి ఆసక్తి చూపకుండా.. కేవలం తన అభినయానికే మొదటి ప్రాధాన్యతనిచ్చిన ఆ బ్యూటీ తెలుగులో ఎన్నో మెమరబుల్ మూవీస్‌లో నటించి ప్రేక్షకుల ఆరాధ్య కథానాయిక అయింది. ఈ ఏడాది పవర్ స్టార్ ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) లో పవర్ ఫుల్ పాత్ర పోషించి అభిమానుల మన్ననలు పొందింది నిత్యామీనన్. అలాంటి ఆ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిత్యామీనన్ త్వరలోనే తన మనసుకు నచ్చిన మలయాళీని మనువాడబోతోందట. 

గత నెలలో నిత్యామీనన్ సమకాలీన మలయాళ బ్యూటీ నయనతార (Nayanathara) పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నిత్య లావణ్య సుందరి నిత్యామీనన్ కూడా పెళ్ళిచేసుకోనుందనే వార్తకు అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె పెళ్ళిచేసుకోబోయే వాడు మలయాళంలో పాపులర్ యాక్టర్ అని తెలుస్తోంది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒకరికొకరికి ఏర్పడిన పరిచయం..ఆపై ప్రేమకు దారి తీసిందని, వారి ప్రేమ వ్యవహారం ఇప్పటివరకూ ఎంతో రహస్యంగా కొనసాగిందని మాలీవుడ్ మీడియా అంటోంది. అయితే ఆ మలయాళ నటుడు ఎవరన్నది  సీక్రెట్‌గా ఉంచారు.  త్వరలోనే తన పెళ్ళి వార్తను నిత్యామీనన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేయనుందట. 

ప్రస్తుతం నిత్యామీనన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా 19 (1) (A), ధనుష్ (Dhanush) హీరోగా ‘తిరుచిత్రాంబళం’ (Thiru Chitrambalam) తమిళ చిత్రాల్లో ప్రధానా పాత్రల్లో నటిస్తోంది. ఇక ‘ఆరాం తిరుకల్పన’ (Aaram Thirukalpana) అనే మలయాళ చిత్రం నిత్యామీనన్ కమిట్ అయిన ఆఖరి చిత్రం. దీని తర్వాత ఆమె మరే సినిమాలోనూ నటించకపోవడం.. ఆమె పెళ్లి వార్తకు మరింతగా బలం చేకూర్చుతోంది. మొత్తం మీద నిత్యామీనన్ కూడా త్వరలో ఇల్లాలు కాబోతోందన్న వార్త అభిమానుల్నే కాకుండా.. దక్షిణాది సినీ ప్రముఖుల్ని కూడా సంతోష పెట్టేదే. మరి తన పెళ్ళి వార్తను అధికారికంగా నిత్యా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.  

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.