నితిన్ చిత్రం ప్రారంభం
ABN , First Publish Date - 2022-04-03T05:30:00+05:30 IST
‘కిక్’, ‘రేసుగుర్రం’, ‘టెంపర్’లాంటి విజయవంతమైన చిత్రాలకు కథ అందించారు వక్కంతం వంశీ. ఆయన ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టారు.

‘కిక్’, ‘రేసుగుర్రం’, ‘టెంపర్’లాంటి విజయవంతమైన చిత్రాలకు కథ అందించారు వక్కంతం వంశీ. ఆయన ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని ప్రారంభించింది. నితిన్ కథానాయకుడు. శ్రీలీల నాయిక. నికితారెడ్డి, సుధాకర్ రెడ్డి సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి పుస్కూర్ రామ్మోహనరావు క్లాప్‌నిచ్చారు. ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇది పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. కథనం కొత్తరీతిలో సాగుతాయి. నితిన్ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంద’’న్నారు నిర్మాతలు. ప్రస్తుతం నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాక వక్కంతం వంశీ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు. హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, సమర్పణ: రాజ్‌కుమార్ ఆకెళ్ల.